News
oi-Srinivas G
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ రోజురోజుకు బలపడటం, ప్రపంచ మార్కెట్లో రిస్క్ వంటి అంశాలు రూపాయి బలహీనతకు కారణంగా మారుతున్నాయి. ఎఫ్ఐఐలు వరుసగా మార్కెట్ నుండి తరలి వెళ్లడం, కరెంట్ ఖాతా లోటు పెరగడం రూపాయిపై ప్రభావం చూపుతోంది. డాలర్ మారకంతో ప్రస్తుతం రూపాయి 79.36 వద్ద ఉంది. క్రితం సెషన్లో 41 పైసలు పతనమైంది. రూపాయి ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. రూపాయి 80 నుండి 82కు పడిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
దేశీయ కరెన్సీ రూపాయి వ్యాల్యూ క్షీణిస్తోంది. మంగళవారం ఏకంగా 41 పైసలు మేర క్షీణించి డాలర్ మారకంతో జీవితకాలం కనిష్టానికి పడిపోయింది. డాలర్ వ్యాల్యూ మరింత బలపడటం, దేశీయ మార్కెట్ నుండి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ప్రవాహం కొనసాగుతుండటం రూపాయి క్షీణతకు కారణంగా మారాయి. దీంతో దేశీయ కరెంట్ ఖాతా లోటు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం.

క్రితం సెషన్లో ఇంటర్ బ్యాంక ఫారెక్స్ మార్కెట్లో రూపాయి వ్యాల్యూ 79.04 వద్ద ట్రేడింగ్ ఆరంభించి, ఇంట్రాడే గరిష్ఠం 79.02, కనిష్ఠం 79.38 వద్ద నమోదయింది. చివరకు 79.36 వద్ద స్థిరపడింది. మొత్తంగా మంగళవారం 41 పైసలు మేర రూపాయి నష్టపోయింది.
English summary
Rupee to depreciate on strong dollar, FII outflows, risk aversion in markets
The Indian rupee is expected to depreciate further on Wednesday amid strong dollar and risk aversion in the global markets.
Story first published: Wednesday, July 6, 2022, 10:05 [IST]