News
oi-Mamidi Ayyappa
Edible Oil Prices: ఎడిబుల్ ఆయిల్ ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్న నేపథ్యంలో వంటనూనెల రిటైల్ ధరలను తగ్గించడంపై చర్చించేందుకు ఆహార మంత్రిత్వ శాఖ ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమ వర్గాలతో నేడు సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ఎడిబుల్ ఆయిల్స్ రిటైల్ ధరలను తగ్గించడంపై చర్చ జరగనుంది. తగ్గుతున్న ధరల ప్రయోజనాలను ప్రజలకు అందించేందుకు కంపెనీలను కోరతామని ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. ఈ సమావేశంలో ధరలపై నిర్ధిష్ట నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఎడిబుల్ ఆయిల్ గరిష్ట రిటైల్ ధర (MRP)లో మార్పులకు ప్రభుత్వం ఆదేశించవచ్చని తెలుస్తోంది.
ధరలను అదుపులో ఉంచేందుకు..
ప్రపంచ వ్యాప్తంగా వంటనూనెల ధరల పతనం మధ్య ఆహార మంత్రిత్వ శాఖ ఈ చర్య చాలా ముఖ్యమైనదిగా మార్కెట్ వార్గాలు పరిగణిస్తున్నాయి. ఇందులో ఎడిబుల్ ఆయిల్ రిటైల్ ధరలను తగ్గించడంపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ విషయంలో.. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బివి మెహతా మాట్లాడుతూ.. గత నెలలో గ్లోబల్ ఎడిబుల్ ఆయిల్ ధరలు టన్నుకు 300-450 డాలర్లు తగ్గాయన్నారు. అయితే రిటైల్ మార్కెట్లలో ఈ తగ్గింపు ఆలస్యంగా జరిగిందని అన్నారు. అయితే డాలర్ తో రూపాయి మారకపు విలువ పతనం కూడా ఈ ఆలస్యానికి కారణంగా మరో నిలుస్తోంది.రానున్న రోజుల్లో రిటైల్ ధరలు తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

పరిస్థితి ఏమిటి..
గత రెండు మూడు వారాలుగా అంతర్జాతీయ మార్కెట్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం సకాలంలో జోక్యం చేసుకోవడంతో రిటైల్ మార్కెట్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. గత నెలలో పలు ఎడిబుల్ ఆయిల్ కంపెనీలు తమ ధరలను లీటరుకు రూ.10-15 తగ్గించాయి. దేశీయ ఎడిబుల్ ఆయిల్ అవసరాల్లో 60 శాతానికి పైగా దిగుమతుల రూపంలోనే భారత్ పొందుతోంది. నవంబర్ 2020 నుంచి అక్టోబర్ 21 మధ్య కాలంలో ఎడిబుల్ ఆయిల్ దిగుమతి దాదాపు 131.3 లక్షల టన్నుల వద్ద స్థిరంగా ఉందని SEA అందించిన సమాచారం ప్రకారం తెలుస్తోంది.
English summary
good news food ministry called meeting with cooking oil companies to reduce vegetable oil retail prices
cooking oil prices going to reduce soon in india as government meeting all companies
Story first published: Wednesday, July 6, 2022, 12:27 [IST]