News
oi-Srinivas G
అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. మన వద్ద ఇటీవల దిగుమతి సుంకం పెంచడంతో ఇక్కడ మాత్రం దాదాపు అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు 1770 డాలర్ల దిగువకు పడిపోయాయి. ఈ లెక్కన మన వద్ద రూ.50,000 దిగువకు తగ్గాలి. కానీ దిగుమతి సుంకం పెంపు కారణంగా రూ.51,000కు పైనే కదలాడుతోంది. దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో నేడు ధరలు కాస్త పెరిగినప్పటికీ క్షీణతతోనే ఉన్నాయి.
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.86 పెరిగి రూ.51,388 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.140 పెరిగి రూ.51,763 వద్ద ట్రేడ్ అయింది. వెండి ధరలు మాత్రం భారీగా పడిపోయాయి. రూ.57,000 దిగువకు వచ్చాయి. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.62 తగ్గి రూ.56,927 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.186 తగ్గి రూ.57,996 వద్ద కదలాడింది.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో ఈ వార్త రాసే సమయానికి గోల్డ్ ఫ్యూచర్ దాదాపు నాలుగు డాలర్లు పెరిగి 1767 డాలర్ల వద్ద కదలాడింది. క్రితం సెషన్లో 1764 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 1 శాతానికి పైగా క్షీణించింది. సిల్వర్ ఫ్యూచర్స్ 19.155 డాలర్ల వద్ద కదలాడింది. ఏడాదిలో 27 శాతానికి పైగా తగ్గింది.
English summary
Gold prices: Yellow metal prices edge up as Dollar rally eases
Gold experienced a little respite on Wednesday after hitting a low of almost seven months in the previous session.
Story first published: Wednesday, July 6, 2022, 13:21 [IST]