జీవన్ తరుణ్ వివరాలు..

LIC జీవన్ తరుణ్ పాలసీ అనేది నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, పర్సనల్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ స్కీమ్. పిల్లల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎల్‌ఐసీ ఈ పాలసీని రూపొందించింది. ఈ పాలసీలో పెట్టుబడి పెట్టేవారికి కంపెనీ సేవింగ్ తో పాటు సేఫ్టీని కూడా అందిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల విద్య, ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

పెట్టుబడికి అర్హత వయస్సు..

పెట్టుబడికి అర్హత వయస్సు..

LIC జీవన్ తరుణ్ పాలసీని తీసుకోవడానికి పిల్లల వయస్సు కనీసం 90 రోజులు ఉండాలి. 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ ప్లాన్ తీసుకోవటం కుదరదు. ఈ పరిస్థితిలో మీ పిల్లల వయస్సు 12 ఏళ్ల కంటే తక్కువగా ఉన్నప్పుడే జీవన్ తరుణ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రిటర్న్స్ పొందవచ్చు. ఏడాది, అర్థ సంవత్సరం, క్వార్టర్లీ లేదా నెలవారీ ప్రాతిపదికన ప్రీమియం చెల్లించవచ్చు.

డబుల్ బోనస్ ప్రయోజనం..

డబుల్ బోనస్ ప్రయోజనం..

పిల్లలకు 25 ఏళ్లు నిండినప్పుడు ఈ పాలసీ కింద పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. పిల్లలకి 20 ఏళ్లు వచ్చే వరకు మీరు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది సౌకర్యవంతమైన ప్లాన్. మెచ్యూరిటీ సమయంలో మీరు ఈ పథకంపై డబుల్ బోనస్ పొందుతారు. మీరు కనీసం రూ.75,000 బీమా సొమ్ముతో ఈ పాలసీని తీసుకోవచ్చు. ఇదే సమయంలో దీనికి గరిష్ఠ పరిమితి లేదు.

రోజూ రూ.150 చెల్లిస్తే.. లక్షలు..

రోజూ రూ.150 చెల్లిస్తే.. లక్షలు..

మీరు 12 సంవత్సరాల పిల్లల కోసం పాలసీని కొనుగోలు చేస్తే.. పాలసీ వ్యవధి 13 సంవత్సరాలు ఉంటుంది. కనీస హామీ మొత్తం రూ.5 లక్షలను జీవన్ తరుణ్ పాలసీ కింద రోజులుక రూ.150 చెల్లిస్తే.. మీ వార్షిక ప్రమీయం రూ.55 వేలు అవుతుంది. ఈ విధంగా ఎనిమిదేళ్లలో మీ మొత్తం పెట్టుబడి రూ.4,40,665 అవుతుంది.

దీని తర్వాత మీరు పెట్టుబడి మొత్తంపై రూ. 2,47,000 బోనస్ పొందుతారు. దీని తర్వాత మీరు లాయల్టీ బోనస్‌గా రూ. 97,000 పొందుతారు. ఈ విధంగా మీరు మెచూరిటీ సమయంలో మొత్తం రూ.8,44,500 అందుకుంటారు.

రూ.15 లక్షలు కావాలంటే..

రూ.15 లక్షలు కావాలంటే..

ఒక వ్యక్తి తన పిల్లల కోసం 90 రోజుల నుంచి ఒక సంవత్సరం లోపు నెలకు రూ. 2,800 పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ సమయానికి పిల్లల పేరు మీద రూ. 15.66 లక్షల నిధిని సృష్టించవచ్చు. ఈ పాలసీ 25 ​​ఏళ్లలో మెచ్యూర్ అవుతుంది. అదే సమయంలో.. మీరు 20 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.2,800 వరకు పెట్టుబడి పెట్టాలి.Source link

Leave a Reply

Your email address will not be published.