ఏ నగరాల్లో ఎంతంటే..

దీంతో హైదరాబాద్ లో గ్యాస్ ధర రూ.1,055 నుంచి రూ.1,105కి చేరింది.పెరిగిన ధరలు జూలై 6వ అంటే ఈ రోజు నుంచి అమలులోకి వస్తున్నాయి. ప్రస్తుతం పెంపు తరువాత ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,053కి పెరిగింది. కోల్‌కతాలో రూ.1,079, ముంబైలో రూ.1,052.50, చెన్నైలో రూ.1068.50కి చేరుకున్నాయి. ఇదే సమయంలో.. దేశీయంగా 5 కేజీల సిలిండర్‌పై రూ.18 పెరగ్గా, 19కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.8.50 తగ్గింది.

తగ్గుతుందనుకుంటే పెంచేశారు..

తగ్గుతుందనుకుంటే పెంచేశారు..

మరోవైపు.. వాణిజ్య సిలిండర్ ధర (LPG కమర్షియల్ సిలిండర్ ధర) మరోసారి తగ్గించటం జరిగింది. ఇంతకు ముందు జూలై 1న చమురు కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరలో రూ.198 భారీ తగ్గింపును ప్రకటించాయి. ఆ తర్వాత రాబోయే కాలంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కూడా చౌకగా మారుతుందని అందరూ భావించారు. కానీ.. ఇప్పుడు గృహ వినియోగ గ్యాస్ ధరలు పెంచి సామాన్యులకు చమురు కంపెనీలు షాకిచ్చాయి.

కమర్షియల్ సిలిండర్లపై స్వల్ప తగ్గింపు..

జూలై 1న ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ రూ.2,021కి తగ్గించబడింది. ఇప్పుడు జులై 6న ధరను మరోసారి తగ్గించిన తర్వాత సిలిండర్ ధర రూ.2,012.50గా ఉంది. అదేవిధంగా కోల్‌కతాలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ.2,132కు లభించనుంది. ముంబైలో రూ.1,972.50, చెన్నైలో రూ.2,177.50కి చేరింది.

సిలిండర్‌పై రూ.200 సబ్సిడీ..

సిలిండర్‌పై రూ.200 సబ్సిడీ..

ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఉజ్వల పథకం కింద ప్రభుత్వం సిలిండర్‌పై రూ.200 సబ్సిడీని ప్రకటించింది. ఈ సబ్సిడీ ఏటా 12 సిలిండర్ల వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో 9 కోట్ల మందికి పైగా వినియోగదారులు లబ్ది పొందనున్నారు.Source link

Leave a Reply

Your email address will not be published.