పెన్నీ స్టాక్స్ బంపర్ రిటర్న్స్..

ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న స్టాక్ ట్రెడ్ ఫాలోకాకుండా తన ప్రయాణాన్ని సాగిస్తోంది. ఆ స్టాక్ పేరేంటంటే కైజర్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ పెన్నీ స్టాక్ ఏడాదిలోనే మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. ఇది ఈ సంవత్సరం మంచి రాబడులు అందించిన మల్టీబ్యాగర్లలో ఒకటిగా నిలిచింది. పెన్నీ స్టాక్స్ కు పవర్ ఎక్కువ అని చెప్పటానికి ఇదొక మంచి ఉదాహరణ.

షేర్ ప్రయాణం ఇలా..

షేర్ ప్రయాణం ఇలా..

కైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ షేరు ధర ఒక సంవత్సరం క్రితం BSEలో ఆగస్టు 16, 2021న 38 పైసలుగా ఉంది. ప్రస్తుతం జూలై 7, 2022న అంటే ఈ రోజు స్టాక్ 5 శాతం అప్పర్ సర్యూట్ లో లాక్ అయి రూ. 93.70 వద్ద ఉంది. అంటే కేవలం ఒక సంవత్సరంలో ఈ స్టాక్ విపరీతమైన రాబడిని అందించింది. ఈ కాలంలో ఇన్వెస్టర్లకు 21,228.95 శాతానికి పైగా అద్భుతమైన రాబడి వచ్చింది. 2022లో కైజర్ కార్పొరేషన్ స్టాక్ 2,675.68 శాతానికి పైగా పెరిగింది.

ఇన్వెస్టర్లకు లాభాల పంట..

ఇన్వెస్టర్లకు లాభాల పంట..

కైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ షేరు ధరను పరిశీలిస్తే.. ఒక ఇన్వెస్టర్ ఈ షేర్‌లో ఏడాది క్రితం 38 పైసల చొప్పున రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. ఈ రోజు దాని విలువ రూ.2.46 కోట్లుగా ఉంది. అదే ఒక ఇన్వెస్టర్ ఈ ఏడాది షేరును రూ.2.92 చొప్పును లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఈ రోజు దాని విలువ రూ.3.20 లక్షలు అయి ఉండేది.

కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం గురించి మాట్లాడుకున్నట్లయితే.. ఇది సెప్టెంబర్ 1993లో ముంబైలో స్థాపించబడింది. మార్చి 15, 1995న కైజర్ ప్రెస్ లిమిటెడ్ పేరుతో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీని తర్వాత కంపెనీ పేరు నవంబర్ 05, 2013న ‘కైజర్ కార్పొరేషన్ లిమిటెడ్’గా మార్చబడింది. ఈ కంపెనీ లేబుల్స్, స్టేషనరీ ఆర్టికల్స్, మ్యాగజైన్‌లు, కార్టన్‌లకు సంబంధించిన వ్యాపారంలో ఉంది.Source link

Leave a Reply

Your email address will not be published.