రైతులను ఆకర్షించేందుకు..

చైనాలో పౌరులు రియల్ ఎస్టేట్ రంగానికి దూరంగా ఉంటూ.. అనిశ్చిత ఆర్థిక వాతావరణంలో నగదు నిల్వ చేయడానికి ఇష్టపడుతున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నాన్‌జింగ్ నగరానికి చెందిన ఒక డెవలపర్‌.. ఇళ్లకు కిలోగ్రాము పుచ్చకాయకు 20 యువాన్ల (రూ. 236) చొప్పున చెల్లించడానికి అనుమతిస్తారు. ఒక వినియోగదారుడు గరిష్ఠంగా 5,000 కిలోగ్రాముల పుచ్చకాయను చెల్లించేందుకు అనుమతి ఉంది. దీని విలువ దాదాపు లక్ష యువాన్లుగా పరిగణిస్తారు. దీనివల్ల రైతులకు కూడా మద్ధతు లభిస్తోంది.

రియల్టీ రంగానికి తక్కువ వడ్డీకే లోన్స్..

రియల్టీ రంగానికి తక్కువ వడ్డీకే లోన్స్..

లాక్‌డౌన్‌ల వల్ల వినియోగదారుల నుంచి వ్యాపార విశ్వాసం దెబ్బతినడంతో రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్‌ను రక్షించే ప్రయత్నాలను చైనా వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా.. చైనా బ్యాంకులు దీర్ఘకాలిక రుణాల కోసం కీలక వడ్డీ రేటును రికార్డు మొత్తంలో తగ్గించడం లాంటి వాటితో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి చైనా అనేక చర్యలు తీసుకుంది.

డిమాండ్ బూస్ట్ చేసేందుకు..

డిమాండ్ బూస్ట్ చేసేందుకు..

బ్యాంక్ లోన్ రేట్లు తగ్గింపు వల్ల తనఖా ఖర్చుల భారం కంపెనీలపై తగ్గింది. బలహీన రుణ డిమాండ్‌ను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, మొదటి-గృహ కొనుగోలుదారుల మార్టగేజ్ కోసం కనీస వడ్డీ రేటును సమర్థవంతంగా తగ్గించింది. ఇది మునుపు 4.6% నుంచి 4.4% కంటే తక్కువ వడ్డీ రేటుతో లోన్ పొందేందుకు వీలు కల్పిస్తోంది.

మంచి రోజులకు కాలం చెల్లింది..

వినియోగదారులకు డబ్బు ఇన్వెస్ట్ చేయటం, పొదుపు చేయటానికి రియల్ ఎస్టేట్, ఆస్తి రంగాల మార్కెట్ ఒక మంచి ప్రత్యామ్నాయం. ఇప్పుడు డెవలపర్లతో పాటు కొనుగోలు దారులు సైతం బ్యాంకుల నుంచి తక్కువ రేట్లకు లోన్స్ తీసుకునేందుకు మక్కువ చూపుతున్నారని తెలుస్తోంది. అయితే చైనాకు మంచి రోజులు గత సంవత్సరంలో ముగిశాయని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం చైనా కంపెనీల గృహ రుణం దాదాపు 10 ట్రిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. చైనాలో దాదాపు 27% బ్యాంకు రుణాలు రియల్ ఎస్టేట్‌తో ముడిపడి ఉన్నాయని థింక్ ట్యాంక్, పాలసీ రీసెర్చ్ గ్రూప్ (POREG) తమ నివేదికలో పేర్కొన్నాయి.

డ్రాగన్ ఆర్థిక వ్యవస్థ డొల్లతనం..

డ్రాగన్ ఆర్థిక వ్యవస్థ డొల్లతనం..

చైనా బ్యాంకుల మెుత్తం లోన్ బుక్ లో 27% రియల్టీ రంగానికి లింక్ అయి ఉన్నాయి. బ్యాంకులు సైతం తక్కువ వడ్డీకి లోన్స్ అందిస్తున్నప్పటికీ చైనా పాటిస్తున్న జీరో-కోవిడ్ వ్యూహం కారణంగా జనవరి- జూన్ మధ్య చైనా ఆస్తి అమ్మకాలు 25 శాతం తక్కువగానే ఉన్నాయి. చైనాకు మంచి రోజులు గత సంవత్సరమే అయిపోయాయని నిపుణులు అంటున్నారు. చైనీస్ రియల్ ఎస్టేట్ డెవలపర్లు మార్కెట్ మందగమనం, బాండ్ డిఫాల్ట్‌లు పెరగడంతో ప్రాపర్టీలకు డిమాండ్ పెంచేందుకు చివరికి గోధుమ, వెల్లుల్లి వంటి ఆహార ఉత్పత్తులను డౌన్‌పేమెంట్‌లుగా అంగీకరించటాన్ని చూస్తే చైనాలో పరిస్థితులు ఎంత దారుమంగా తయారయ్యాలో అర్థమౌతోంది. పైకి డ్రాగన్ అంతా బాగున్నట్లే చెబుతున్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థలో డొల్లతనం కనిపిస్తోంది.Source link

Leave a Reply

Your email address will not be published.