ఏఏ కంపెనీలు అమ్ముతున్నాయి..

ప్రధాన సన్‌స్క్రీన్ కంపెనీల్లో సన్ ఫార్మా, H &H, IPCA, గ్లెన్‌మార్క్ ఉన్నాయి. చాలా కంపెనీలు ఈ ఏడాది తమ విక్రయాలను రెండు నుంచి మూడు రెట్లు పెంచుకున్నాయి. సన్‌స్కిన్ అమ్మకాలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటి కారణం.. ప్రజల్లో దీనిపై అవగాహన పెరగడం కాగా.. మరొకటి ప్రిస్కైబ్ చేయబడ్డ మందుల లభ్యత పెరగటం.

రేటు ఎక్కువైనప్పటికీ..

రేటు ఎక్కువైనప్పటికీ..

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రిస్క్రిప్షన్ సన్‌స్క్రీన్‌లు సాధారణ సన్‌స్క్రీన్‌ల కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ ఖర్చవుతున్నప్పటికీ అవి బాగా ప్రాచుర్యం పొందాయి. చాలా ఔషధ సన్‌స్క్రీన్‌లు ప్రిస్క్రిప్షన్ ద్వారా అందుబాటులో ఉన్నప్పటికీ, అవి కౌంటర్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.

మెుటిమలు ఉన్న వారికి..

మెుటిమలు ఉన్న వారికి..

మొటిమల వంటి చర్మ వ్యాధులకు చికిత్స చేయడానికి వైద్యులు కొన్ని సన్‌స్క్రీన్‌లను సిఫార్సు చేస్తారు. మే నెలలో చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందుల్లో సన్‌స్క్రీన్‌లు అత్యధిక వృద్ధిని సాధించాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 150 శాతం పెరిగాయి. అయితే.. దీనికి ఒక కారణం గత సంవత్సరం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నందున అప్పుడు వినియోగం కొంత తక్కువగానే ఉంది.

అమ్మకాలు ఇందుకే పెరుగుతున్నాయి..

అమ్మకాలు ఇందుకే పెరుగుతున్నాయి..

సన్‌స్క్రీన్ మార్కెట్ బూమ్‌కి రెండు కారణాలు ఉన్నాయని సన్ ఫార్మా ఇండియా బిజినెస్ సీఈవో కీర్తి గనోర్కర్ అన్నారు. మొదటి కారణం గత సంవత్సరం వినియోగం తక్కువగా ఉండటం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా కార్యాలయాలు తెరుచుకోవడం రెండో కారణమని అన్నారు.

దీంతో పాటు దేశంలో సన్‌స్క్రీన్‌పై అవగాహన పెరుగుతోందని కీర్తి తెలిపారు. ప్రిస్క్రిప్షన్ సన్‌స్క్రీన్ మార్కెట్‌లో సన్ ఫార్మా 18 శాతం వాటాను కలిగి ఉంది. కంపెనీకి ఫోటోస్టేబుల్, సన్‌క్రాస్ అనే రెండు బ్రాండ్‌లు ఉన్నాయి. దీని తర్వాత అత్యధికంగా అమ్ముడైన హెగ్డే & హెగ్డే బ్రాండ్ సన్‌బాన్ నిలిచింది. కరోనాకి ముందు కాలంలో కూడా సన్‌స్క్రీన్ విక్రయాల్లో ఇదే జోరు కనిపించిందని కంపెనీలు చెబుతున్నాయి.Source link

Leave a Reply

Your email address will not be published.