పర్సులలో దేవుడి ఫోటోలు పెట్టకూడదు

పర్సులో పెట్టే కొన్ని వస్తువులు మన జీవితంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని మరియు డబ్బు విషయంలో కూడా బాధ పడే పరిస్థితిని తెస్తాయని చెబుతున్నారు. అందుకే మన పర్సులో ఏయే వస్తువులు ఉంచుకోకూడదో కూడా వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. పర్స్‌లో దేవుడి ఫోటోలు ఎప్పుడూ పెట్టకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో దేవుడు ఫోటో పెట్టుకోవడం వల్ల అప్పుల భారం పెరుగుతుంది. జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పర్స్‌లో దేవుడి బొమ్మను పెట్టుకోకూడదు అని చెప్పడం వెనుక మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. ఎక్కడపడితే అక్కడ తిరిగి, అశుభ్రమైన చేతులతో పర్సును పదే పదే తాకుతాము. ఇలా చేయడం వల్ల దేవతలను అపవిత్రం చేసిన వారిని అవుతామని వాస్తు శాస్త్రం చెబుతోంది.

చనిపోయిన పెద్దల ఫోటోలను పర్సులలో పెట్టుకోకూడదు

చనిపోయిన పెద్దల ఫోటోలను పర్సులలో పెట్టుకోకూడదు

వాస్తు శాస్త్రం ప్రకారం, చనిపోయిన పూర్వీకుల ఫోటోలను పర్సులో ఉంచుకోవడం శుభపరిణామంగా పరిగణించబడదు. ఈ కారణంగా, మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలాసార్లు కొంతమంది చనిపోయిన కుటుంబసభ్యుల ఫోటోలను పర్సులో ఉంచుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అశుభం గా పరిగణించబడుతుంది. పర్సులలోడబ్బులు పెట్టుకుంటాము, డబ్బు అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి నివాసం ఉండే పర్సులో మనం చనిపోయిన వారి ఫోటోలు పెట్టడం దోషంగా చెప్పబడింది. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహించి మన నుండి వెళ్ళిపోతుందని చెప్తారు. పర్సులో చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకుంటే డబ్బుకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

చిరిగిన పర్సులను వాడకూడదు

చిరిగిన పర్సులను వాడకూడదు

కొంతమంది పర్సు చిరిగి పోయినప్పటికీ దానినే వాడుతూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం చిరిగిన పర్సును ఉంచుకోవద్దు. పర్స్ చిరిగిపోకుండా లేదా చాలా పాతది కాకుండా ఉన్న వాటిని వినియోగించాలి. ఒకవేళ చిరిగిన పర్సును వినియోగిస్తే దీంతో జీవితంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. అలాగే, పర్స్‌లో ఎలాంటి లోన్, బిల్లు పేపర్లు మరియు వడ్డీ చెల్లించే పత్రాలను ఎప్పుడూ ఉంచుకోవద్దు. ఇలా చేయడం వల్ల చాలా ఆర్ధిక నష్టం కలుగుతుందని చెబుతున్నారు.

చిరిగిన నోట్లు, తాళం చెవులు పర్సులో పెట్టకూడదు

చిరిగిన నోట్లు, తాళం చెవులు పర్సులో పెట్టకూడదు

అంతేకాదు చిరిగిపోయిన నోట్‌ని పర్సులో పెట్టుకోవద్దు. వాస్తు ప్రకారం ఇలా చేయడం మంచిది కాదు. దీంతో లక్ష్మీ దేవి కోపానికి గురై విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. అలాగే ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇక పర్సులో ఏవైనా పాత బిల్లులు ఉంచుకోవడం కూడా మంచిది కాదని సూచించబడింది. అదేవిధంగా పర్స్ నుండి కీని దూరంగా ఉంచండి. పర్స్‌లో ఎప్పుడూ కీని ఉంచవద్దు. వాస్తు ప్రకారం, ఇలా చేయడం ద్వారా డబ్బు కొరతను ఎదుర్కోవలసి ఉంటుంది. లక్ష్మీదేవి కొలువై ఉండే చోట లోహంతో తయారు చేసిన తాళం చెవులు ఉంచటం కూడా మంచిది కాదని సూచించబడింది.Source link

Leave a Reply

Your email address will not be published.