ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఎలా పనిచేస్తుంది..?

శాలరీ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ వాస్తవానికి ఒక రకమైన టర్మ్ ఇన్సూరెన్స్. దీనిని తీసుకునేటప్పుడు మీరు రెండు ఆప్షన్లు ఉంటాయి. మొదటి ఎంపిక సాధారణ ఆదాయాన్ని ఎంచుకోవడం, రెండవ ఆప్షన్ టోటల్ అమౌంట్ ఎంచుకోవడం. సాధారణ ఆదాయాన్ని ఎంచుకున్నట్లయితే.. మీ కుటుంబానికి సాధారణ చెల్లింపులు మీ తర్వాత కొనసాగుతాయి. మరోవైపు.. మీరు ఏకమొత్తాన్ని ఎంచుకున్నట్లయితే టోటల్ అమౌంట్ మీ కుటుంబానికి ఒకేసారి చెల్లించటం జరుగుతుంది.

టేక్-హోమ్ శాలరీ ఎంచుకోవచ్చు..

టేక్-హోమ్ శాలరీ ఎంచుకోవచ్చు..

మీరు శాలరీ ప్రొటెక్షన్ టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినప్పుడు.. మీరు మీ కుటుంబానికి ఇవ్వాలనుకుంటున్న నెలవారీ ఆదాయాన్ని ఎంచుకోవచ్చు. ఈ ఆదాయం మీ ప్రస్తుత టేక్-హోమ్ జీతానికి సమానంగా లేదా తక్కువగా ఉండవచ్చు. ఆ తర్వాత మీరు ప్రీమియం చెల్లించే కాలాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. మీరు 30 ఏళ్ల వయస్సులో రెగ్యులర్ ప్రీమియం చెల్లించే టర్మ్ కోసం 15 ఏళ్లపాటు పాలసీని కొనుగోలు చేయవచ్చు.

నెలవారీ ఆదాయం ఎలా..

నెలవారీ ఆదాయం ఎలా..

ఇన్సూరెన్స్ కంపెనీ మీ నెలవారీ ఆదాయంపై వార్షిక శాతాన్ని కూడా పెంచవచ్చు. ఉదాహరణకు.. మీరు ఈ ఆదాయంపై సంవత్సరానికి 6% చక్రవడ్డీని అందించవచ్చు. పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీరు రూ. 50,000 నెలవారీ ఆదాయాన్ని ఎంచుకున్నారని అనుకుందాం. పాలసీ రెండో సంవత్సరంలో రూ.53 వేలకు పెరుగుతుంది. ఆ తరువాతి ఏడాది రూ.56,180 అవుతుంది. ఇప్పుడు పాలసీదారు పాలసీ తీసుకున్న 5వ సంవత్సరం ప్రారంభంలో మరణించినట్లయితే.. నామినీకి రూ. 7.6 లక్షల డెత్ బెనిఫిడ్ తో పాటు రూ. 63,124 పెరిగిన నెలవారీ ఆదాయం లభిస్తుంది.Source link

Leave a Reply

Your email address will not be published.