రికార్డు కనిష్ఠాల వద్దా బంగారం ధరలు..

ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఈ వారం ప్రారంభంలో US డాలర్‌లో ర్యాలీ మధ్య ఆరు నెలల కంటే ఎక్కువ కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. తరువాత కొంత ఉపశమనం పొందాయి. ఈరోజు బంగారం ధరలు ఔన్సుకు 1,739.71 అమెరికన్ డాలర్లుగా ఉంది. వారం ప్రారంభంలో మంగళవారం బంగారం ధర ఔన్స్‌కి 1,767.53గా ఉంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో డిసెంబర్ తర్వాత ప్రస్తుత ధర కనిష్ఠంగా ఉంది. మన దేశంలో ఇటీవల ఇంపోర్ట్ డ్యూటీని పెంచింది. 2008 నాటి ఆర్థిక సంక్షోభం వచ్చే ప్రమాదాలు ఉన్నాయని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు అత్యధిక స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణం అంచనాలకు ఊతం ఇస్తోంది.

రేట్ల పతనానికి కారణాలు..

రేట్ల పతనానికి కారణాలు..

గ్లోబల్ గోల్డ్ ధరలు ఎక్కువ నష్టపోతున్నాయి. డాలర్‌లో అధిక లాభాలు, పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా బంగారంపై స్వల్పకాలం లేదా దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య భారీగా తగ్గింది. గోల్డ్ ఇన్వెస్టర్ల నుంచి మద్ధతు తగ్గటం వల్ల ధరల పతనం కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు. అధిక వడ్డీ రేట్లు, బాండ్ ఈల్డ్‌లు బులియన్ హోల్డింగ్ కు అవరోధాలుగా మారాయి. మరో పక్క వెండి ధరలు తగ్గటం కనిపిస్తోంది.

ఆర్థిక లోటు తగ్గించేందుకు..

ఆర్థిక లోటు తగ్గించేందుకు..

భారత ప్రభుత్వం గత శుక్రవారం బంగారంపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 7.5% నుంచి 12.5%కి పెంచింది. భారతదేశం తన బంగారం అవసరాన్ని చాలా వరకు దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. ఆర్థిక లోటు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. బంగారంపై ప్రస్తుతం 3 శాతం జీఎస్టీ కూడా దేశంలో ఉంది.

మాంద్యం భయాలు..

మాంద్యం భయాలు..

“అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు దాదాపు ఏడు నెలల కనిష్టానికి చేరగా, వెండి 2 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ ఇండెక్స్ 20-సంవత్సరాల గరిష్ఠ స్థాయిని తాకి, గ్లోబల్ రిసెషన్ భయాల కారణంగా 106 పాయింట్లను దాటిన తర్వాత బంగారం, వెండి మంగళవారం క్రాష్ అయ్యాయి. బంగారం మద్దతు $1755-1742 వద్ద ఉండగా.. నిరోధం $1782-1794 వద్ద ఉంది. వెండికి $19.30-19.05 వద్ద మద్దతు ఉండగా.. నిరోధం $19.95-20.20 వద్ద ఉంది” అని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ ప్రతినిధి రాహుల్ కలంత్రి అన్నారు.Source link

Leave a Reply

Your email address will not be published.