స్టాక్ ప్రస్తుత విలువ..

మీరు వెతుకుతున్న మల్టీబ్యాగర్ స్టాక్ పేరు అజంతా ఫార్మా. ఒకప్పుడు ఈ షేరు ధర రూ.5 కంటే తక్కువగానే ఉండేది. కానీ.. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ ఉదయం 10 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో రూ. 1,177.30గా ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ కొంత నెగటివ్ లోనే ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ 52 వారాల కనిష్ఠం రూ. 1,061.77 వద్ద ఉండగా.. గరిష్ఠం 1,623.34గా ఉంది.

అద్బుతమైన రాబడి..

అద్బుతమైన రాబడి..

గత కొన్ని సంవత్సరాల్లో ఈ స్టాక్ మంచి రిటన్న్స్ అందించింది. అజంతా ఫార్మా షేర్లు మార్చి 06, 2009లో రూ.4.50 వద్ద ట్రేడ్ అయింది. కానీ దాని ప్రస్తుతం విలువ రూ. 1,177.30 వద్ద ఉంది. ఈ కాలంలో స్టాక్ లో పెట్టుబడి పెట్టిన వారికి మల్టీబ్యాగర్ రిటర్న్స్ వచ్చాయి. అందుకే స్టాక్ మార్కెట్లో దీర్ధకాలంలో మంచి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తుంటాయి. ఈ క్రమంలో పెట్టుబడిదారులకు 20,000 శాతం రాబడులు వచ్చాయి. అంటే.. ఆ సమయంలో స్టాక్ లో ఎవరైనా వ్యక్తి లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టిఉండే.. ప్రస్తుతం వారికి రూ.2.61 కోట్లు రాబడి వచ్చి ఉండేది. కనీసం రూ.10 వేలు పెట్టుబడిగా పెట్టి ఉంటే.. సుమారు రూ. 26 లక్షల కంటే ఎక్కువ రాబడి వచ్చి ఉండేది.

10 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేస్తే..

10 సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేస్తే..

అజంతా ఫార్మా కంపెనీ షేర్లలో జూన్ 22, 2012న రూ. 59.70 ధరలో లక్ష పెట్టుబడిగా పెట్టిన వారికి.. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం రూ.19.72 లక్షలు అయి ఉండేది. అయితే ఆరు నెలల కాలంగా ఈ స్టాక్ కరెక్షన్ లో ఉంది. ఈ కాలంలో 20 శాతానికి పైగా విలువను షేర్ కోల్పోయింది. అంటే ప్రస్తుతం షేర్ తక్కువ ధరకు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంది. 2022 ప్రారంభం నుంచి షేర్ విలువ క్రమంలో క్షీణిస్తోంది. కరోనా సమయంలో అమ్మకాల కారణంగా కంపెనీ మంచి పనితీరును కనబరిచింది.

కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం..

అజంతా ఫార్మా భారత దేశానికి చెందిన మల్టీ నేషనల్ కంపెనీ. దీని ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. ఈ కంపెనీ 1973లో స్థాపించబడింది. ప్రస్తుతం ఈ కంపెనీ డవలప్ మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ తో పాటు మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కంపెనీ ఉద్యోగులు సైతం సంస్థపై మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.Source link

Leave a Reply

Your email address will not be published.