కింగ్ ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్..

స్టాక్ మార్కెట్ ద్వారా వేలకోట్ల సంపదను ఆర్జించిన వారిలో రాకేష్ జున్‌జున్‌వాలా పేరు మొదటి వరుసలో ఉంటుంది. అందుకే ఆయనను ఇండియన్ స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ అని కూడా పిలుస్తారు. జున్‌జున్‌వాలా సామర్థ్యాన్ని ఈ టైటిల్‌ని మరోసారి నిరూపించింది. అతని హోల్డింగ్‌లో ఉన్న చాలా షేర్లు గురువారం పెరిగాయి. అయితే కేవలం రెండు స్టాక్‌లలో ఇంత అద్భుతమైన జంప్ నమోదయింది. ఒక్క రోజులో జున్‌జున్‌వాలా సంపద సుమారు రూ. 1,061 కోట్లు పెరిగింది.

 జున్‌జున్‌వాలాకు ఇష్టమైన కంపెనీలు..

జున్‌జున్‌వాలాకు ఇష్టమైన కంపెనీలు..

రాకేష్ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలోని రెండు అత్యంత విలువైన స్టాక్‌లు టైటాన్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ అని చెప్పుకోవాలి. నిన్నటి ట్రేడింగ్‌లో ఈ రెండు షేర్లలో భారీ జంప్ నమోదైంది. టాటా గ్రూప్‌ కంపెనీ టైటాన్‌ షేర్లు 8 శాతం వరకు ఎగబాకగా, మరో కంపెనీ స్టార్‌ హెల్త్‌ షేరు 16 శాతానికి పైగా పెరిగింది. భారతీయ వారెన్ బఫెట్‌గా ప్రసిద్ధి చెందిన రాకేష్ జున్‌జున్‌వాలా మొత్తం నికర విలువకు ఈ రెండు స్టాక్స్ ప్రధాన సహకారాన్ని అందిస్తున్నాయి.

జున్‌జున్‌వాలా టైటాన్‌లో వాటాల వివరాలు..

జున్‌జున్‌వాలా టైటాన్‌లో వాటాల వివరాలు..

BSEలో టైటాన్ షేరు నిన్న రూ.114.60 పెరిగి రూ.2,128 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో ఇది ఒకేసారి రూ. 2,170.95కి చేరుకుంది. దీని ప్రకారం ఇంట్రా-డే జంప్ 7.8 శాతం వరకు ఉంది. టైటాన్ షేరు గత ఏడాది కాలంలో 23 శాతానికి పైగా లాభపడింది. ప్రస్తుతం దీని మార్కెట్ క్యాప్ రూ.1,88,920 కోట్లుగా ఉంది. ఈ షేర్ 52 వారాల గరిష్ఠ ధర రూ.2,767.55 కాగా, 52 వారాల కనిష్ఠ ధర రూ.1.661.85గా ఉంది. కంపెనీ షేర్‌హోల్డింగ్ సరళిని పరిశీలిస్తే.. రాకేష్ జున్‌జున్‌వాలా, అతని భార్య రేఖాకు కంపెనీలో మెుత్తం 5.05 శాతం వాటాను కలిగి ఉన్నారు. అంటే.. జున్‌జున్‌వాలా కుటుంబం టైటాన్‌లో 4,48,50,970 షేర్లను కలిగి ఉంది.

స్టార్ హెల్త్ లాభాలు ఇలా..

స్టార్ హెల్త్ లాభాలు ఇలా..

మరోవైపు గురువారం BSEలో స్టార్ హెల్త్ షేరు రూ.54.25 పెరిగి రూ.530.20 వద్ద ముగిసింది. ప్రస్తుతం దీని మార్కెట్ క్యాప్ దాదాపు రూ.30,544.83 కోట్లుగా ఉంది. ఈ కంపెనీలో రాకేష్ జున్‌జున్‌వాలాకు 82,882,958 షేర్లు అంటే 14.40 శాతం వాటా ఉంది. అదే సమయంలో ఆయన భార్య రేఖా జున్‌జున్‌వాలాకు 3.11 శాతం అంటే 17,870,977 షేర్లు ఉన్నాయి. ఇలా ఇద్దరూ కలిసి స్టార్ హెల్త్‌లో 17.5 శాతం వాటాను కలిగి ఉన్నారు. అంటే కంపెనీలో వీరిద్దరికీ కలిపి 100,753,935 షేర్లు ఉన్నాయి. దీంతో నిన్న ‌జున్‌జున్‌వాలా సంపద రూ.546.59 కోట్లు పెరిగింది.Source link

Leave a Reply

Your email address will not be published.