News
oi-Srinivas G
మీరు ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమరా? అయితే ఇది మీకోసమే! ఎస్బీఐ ఇటీవల కేవైసీ(నో యువర్ కస్టమర్) అప్ డేట్ చేయనందున పలువురి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసింది. అయితే ఖాతాల నిలిపివేతపై పలువురు సోషల్ మీడియా వేదికపై ఫిర్యాదులు చేశారు. దీనిపై ఎస్బీఐ స్పందించింది. బ్యాంకు సేవలు నిరంతరాయంగా కొనసాగించేందుకు ఆర్బీఐ నిబంధనల మేరకు కస్టమర్లు వారి కేవైసీని క్రమానుగతంగా అప్ డేట్ చేయాలని తెలిపింది.
అంతేకాకుండా కేవైసీ అప్డేషన్ కోసం సంబంధించిన సమాచారాన్ని బ్యాంకు ఖాతాదారులకు ఎస్సెమ్మెస్ లేదా ఈ-మెయిల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నట్లు వెల్లడించింది. బ్యాంకు నుండి కేవైసీ సమాచారం అందిన కస్టమర్లు కేవైసీ అప్డేషన్ కోసం నిర్దిష్ట ఫార్మాట్‌తో కూడిన ఫామ్‌ను ఇవ్వాలి. ఇది ఆన్ లైన్ లేదా బ్రాంచీలో అందుబాటులో ఉంటుంది.

ఈ ఫామ్‌ను పూర్తి చేసి, అందులోని కింది భాగంలో సంతకం చేసి, బ్యాంకు బ్రాంచీలో ఇవ్వాలి లేదా రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడీ ద్వారా కూడా పంపించవచ్చు లేదా పోస్టల్ ద్వారా పంపించవచ్చు. అయితే ఇంతకుముందు కేవైసీకి, ప్రస్తుత కేవైసీకి మార్పులు లేని వారు మాత్రమే ఈ-మెయిల్ లేదా పోస్టల్ ద్వారా పంపించాలి. మార్పులు ఉంటే మాత్రం నేరుగా బ్యాంకు బ్రాంచీకి వెళ్లి పూర్తి చేయాలి.
కేవైసీ అప్ డేషన్ కోసం పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఎన్ఆర్ఈజీఏ కార్డు, పాన్ కార్డు.. వీటిలో ఏదైనా ఒకటి గుర్తింపు, చిరునామా ప్రూఫ్ కోసం ఇవ్వవచ్చు.
English summary
SBI accounts blocked for not updating KYC, What customers can do now?
This bit of news is very important for SBI account holder. The top lender has frozen several accounts of SBI customers for non compliance with KYC norms.
Story first published: Friday, July 8, 2022, 9:24 [IST]