News
oi-Chekkilla Srinivas
మీరు ఇప్పటి వరకు బీఎస్ఎన్ఎల్, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా, జీయో సేవలు వాడుతున్నారు. ఇప్పుడు మరో టెలికామ్ కంపెనీ రాబోయే అవకాశం ఉంది. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ ఈనెల 26 నుంచి జరగనున్న స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు అదానీగ్రూప్ దరఖాస్తు చేసుకున్నట్సు పీటీఐ పేర్కొంది. దీంతో ఆదానీ టెలికామ్ రంగంలో ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది..
ఎలాంటి ప్రకటన చేయలేదు
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ విషయమై అదానీ గ్రూప్ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు అధికారికంగా ఈనెల 12న బయటకు వస్తాయి. ప్రభుత్వం 600 మెగాహెర్ట్జ్, 700 మెగాహెర్ట్జ్, 3300 మెగాహెర్ట్జ్లతో సహా అనేక బ్యాండ్లలో 5G ఎయిర్‌వేవ్‌లను అమ్మకానికి ఉంచింది.

కంపెనీల మధ్య పోటీ పెరుగుతుందా
5Gతో పాటు, 26 GHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz వేలం వేయనుంది.కనీసం రూ.4.3 లక్షల కోట్ల విలువ కలిగిన 72,097.85 మెగాహెర్ట్జ్ సెక్ట్రం వేలం జులై 26 నుంచి ప్రారంభం కానుంది. ఇటీవలే నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (ఎన్ఎల్డీ), ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (ఐఎల్‌డీ) లైసెన్సులను అదానీ దక్కించుకుంది. ఒక వేళ ఆదానీ టెలికామ్ రంగంలోకి వస్తే కంపెనీల మధ్య పోటీ పెరిగిరీఛార్జ్ రేట్లు తగ్గే అవకాశం ఉంది. అయితే దీనిపై కచ్చితమైన సమాచారం లేనప్పటికీ

English summary
Adani Group in race to acquire 5G spectrum
Adani Group is learnt to have applied to participate in the upcoming 5G spectrum auctions to be held later this month, a move that may mark its entry into the telecom industry.
Story first published: Saturday, July 9, 2022, 9:10 [IST]