News
oi-Chekkilla Srinivas
స్టాక్ మార్కెట్లు ఈ వారం సానుకూలంగా ముగిశాయి. సెన్సెక్స్ 54,500, నిఫ్టీ 50 16,200 వద్ద ముగిశాయి. పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలలో చెప్పుకోదగ్గ లాభాలను జోడించారు. కమోడిటీ ధరల తగ్గుదల, విదేశీ నిధుల తరలింపులో మందగమనం కారణంగా మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. ఈ వారం BSEలో పెట్టుబడిదారుల సంపద దాదాపు రూ.7.73 లక్షల కోట్లు పెరిగింది. ప్రస్తుత మార్కెట్ పనితీరు జూన్ త్రైమాసిక ఫలితాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
సెన్సెక్స 303, నిఫ్టీ 87 పాయింట్లు
శుక్రవారం, సెన్సెక్స్ 303.38 పాయింట్లు పెరిగి 54,481.84 వద్ద ముగిసింది. నిఫ్టీ 87.70 పాయింట్లు 16,220.60 వద్ద స్థిరపడింది. క్యాపిటల్ గూడ్స్ మెరుగైన పనితీరు, బ్యాంకింగ్ స్టాక్‌లు కూడా లాభాలకు మద్దతు ఇవ్వడంతో సెక్టోరల్ ఇండెక్స్‌లలో విస్తృత ఆధారిత కొనుగోళ్లు కనిపించాయి. మెటల్ స్టాక్స్ ఒత్తిడి కొనసాగింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ఈ వారం 3% కంటే ఎక్కువ పెరిగాయి. జూలై 8 చివరి నాటికి BSE మార్కెట్ క్యాప్ దాదాపు ₹2,51,59,998.80 కోట్లకు చేరుకుంది.

అగ్రస్థానంలో రిలయన్స్
BSEలోని టాప్ 10 అత్యంత విలువైన కంపెనీలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) ₹16,17,879.36 కోట్ల మార్కెట్ క్యాప్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాత TCS ₹11,94,625.39 కోట్లు, HDFC బ్యాంక్ ₹7,75,832.15 కోట్ల వద్ద ఉన్నాయి. ఇన్ఫోసిస్, హెచ్‌యుఎల్ కూడా వరుసగా ₹6,37,033.78 కోట్లు , ₹5,86,422.74 కోట్ల మార్కెట్ క్యాప్‌తో నాలుగు, ఐదవ స్థానాల్లో నిలిచాయి. ₹5,25,656.96 కోట్ల మార్కెట్ క్యాప్‌తో ICICI బ్యాంక్, ₹4,47,841.46 కోట్లతో LIC, ₹4,35,922.66 కోట్లతో SBI, ₹4,06,213.61 కోట్లు HDFC, భారతీ ఎయిర్టెల్ ₹3,81,833.20 కోట్లతో ఉంది.
English summary
Investors wealth rises near ₹7.73 lakh cr this week on bullish markets. Will this trend continue
Investors’ wealth on BSE skyrocketed by nearly ₹7.73 lakh crore this week. Going forward, the seesaw sentiment stays on the broader markets, however, the focus will shift to June 2022 quarterly earnings
Story first published: Saturday, July 9, 2022, 19:12 [IST]