News
oi-Chekkilla Srinivas
టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహనాల శ్రేణి ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. పెంచిన ధరలు శనివారం నుంచి అమల్లోకి తెచ్చినట్లు ప్రకటించింది. వేరియంట్, మోడల్‌ను బట్టి 0.55% వెయిటెడ్ సగటు పెరుగుదల శనివారం నుంచి అమలులోకి వస్తుందని ఆటో మేజర్ ఒక ప్రకటనలో తెలిపారు.పెరిగిన ఇన్పుట్ ఖర్చుల వల్ల ధరలు పెంచాల్సి వచ్చిందన్నారు. ఓ వైపు ఉత్పత్తి వ్యయం పెరిగినా వినియోగదారులపై స్వల్ప భారం పడేలా చూశామని వివరించింది. పంచ్, నెక్సాన్, హ్యారియర్, సఫారీ పేరిట ప్రయాణికుల వాహనాలను టాటా మోటార్స్ సెల్ చేస్తోంది. మరోవైపు ఇటీవలే తన కమర్షియల్ వాహనాల ధరలను 1.5 నుంచి 2.5 శాతం మేర టాటా మోటార్స్ పెంచింది.
పెరిగిన అమ్మకాలు
లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌తో సహా ఆటోమొబైల్ మేజర్ గ్లోబల్ హోల్‌సేల్స్, జూన్ 2022 (క్యూ1ఎఫ్వై23) కాలంలో ముగిసిన త్రైమాసికంలో 48% పెరిగాయి. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, FY23 మొదటి త్రైమాసికంలో అన్ని టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల గ్లోబల్ హోల్‌సేల్స్ Q1 కంటే 97% పెరిగి 1,03,529 యూనిట్ల వద్ద ఉన్నాయి. Q1FY23లో, అన్ని ప్యాసింజర్ వాహనాల గ్లోబల్ ల్‌సేల్ Q1 FY22తో పోలిస్తే 32% పెరిగి 2,12,914 యూనిట్లుగా ఉంది.

కమర్షియల్ వాహనాలు
జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క గ్లోబల్ హోల్‌సేల్స్ 82,587 యూనిట్లుగా ఉన్నాయి. మోడల్ వారీగా, ఈ త్రైమాసికంలో జాగ్వార్ హోల్‌సేల్స్ 14,596 వాహనాలు కాగా, త్రైమాసికానికి ల్యాండ్ రోవర్ హోల్‌సేల్స్ 67,991 వాహనాలుగా ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో, టాటా మోటార్స్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ విక్రయాలను మినహాయించి జూన్ నెలవారీ మరియు Q1FY23 విక్రయాల డేటాను ప్రకటించింది.
English summary
Tata Motors hikes passenger vehicle prices to offset rising input costs
Tata Motors on Saturday announced that it has raised the prices of its passenger vehicle range with immediate effect in a bid to partially offset the impact of rising input costs.
Story first published: Saturday, July 9, 2022, 16:33 [IST]