దేశంలో 75 మిలియన్ల మంది మధుమేహ రోగులు..

ప్రస్తుతం భారతదేశంలో మధుమేహంతో బాధపడుతున్న రోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. దేశంలో దాదాపు 7.5 కోట్ల మంది రోగులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఖరీదైన మందుల కారణంగా ఈ వ్యాధికి చికిత్స పొందలేని వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు అలాంటి రోగులకు కూడా ప్రయోజనం కలగనుంది.

వచ్చే వారం నుంచి మార్కెట్‌లోకి జెనెరిక్ వెర్షన్..

వచ్చే వారం నుంచి మార్కెట్‌లోకి జెనెరిక్ వెర్షన్..

అమెరికన్ సంస్థ మెర్క్ జానువియా జెనరిక్ వెర్షన్‌లు వచ్చే కొద్ది నెలల్లో విడుదల కానున్నాయి. భారతదేశంలో ఔషధాల వ్యాపారంలో చాలా కంపెనీలు ఉన్నాయి. వీటిలో డాక్టర్ రెడ్డీస్, గ్లెన్‌మార్క్, సన్ ఫార్మా, జేబీ కెమికల్స్ ఈ డ్రగ్ జనరిక్ వెర్షన్‌తో వచ్చే వారం మార్కెట్లోకి రాబోతున్నాయి. దీనితో పాటు.. సిప్లా, టోరెంట్, జైడస్ క్యాడిలా, లుపిన్ వంటి 50 నుంచి 100 సంస్థలు కూడా ఈ వ్యూహంపై పనిచేస్తున్నాయి.

స్టిగ్‌ బ్రాండ్ పేరుతో అందుబాటులోకి..

స్టిగ్‌ బ్రాండ్ పేరుతో అందుబాటులోకి..

డాక్టర్ రెడ్డీస్ స్టిగ్ బ్రాండ్ పేరుతో సిటాగ్లిప్టిన్‌ను విడుదల చేయబోతున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ప్రతినిధి తెలిపారు. డయాబెటిక్ రోగులకు అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన మందుల్లో స్టిగ్ ఒకటి. అదే సమయంలో.. గ్లెన్‌మార్క్ కంపెనీ ఔషధం అందుబాటులో ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. జనరిక్ మందు అందుబాటులోకి రావటం వల్ల చికిత్స ఖర్చు భారీగా తగ్గుతుందని, దీని వల్ల అనేక మందికి చికిత్స చేయించుకునే సౌలభ్యం అందుబాటులోకి వస్తుందని ఫార్మా కంపెనీలు అంచనా వేస్తున్నాయి.Source link

Leave a Reply

Your email address will not be published.