News
oi-Mamidi Ayyappa
వినియోగదారుల ఆర్డర్లకు ఎలాంటి ఛార్జ్ చేయకపోవటం వల్ల.. డోర్‌డాష్ శుక్రవారం మధ్యాహ్నం వరకు ట్విట్టర్లో భారీగా ట్రెండ్‌లో ఉంది. ఎందుకంటే.. వినియోగదారులు ఉచిత ఆహారం కోసం గ్లిచ్‌ను వినియోగించుకుని ఆహారాన్ని ఉచితంగా పొందారు. అయితే కొంత మంది కేవలం ఆహారంతోనే ఆగలేదు. ఆన్లైన్లో షేర్ చేయబడిన పోస్ట్‌లు కస్టమర్లు వేల డాలర్ల బిల్లులతో ఖరీదైన ఆల్కహాల్ సైతం ఆర్డర్ చేశారు. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్లను సైతం భారీగా కొనుగోలు చేసినట్లు ఒక వ్యక్తి ట్వీట్ చేశాడు. ఒక సందర్భంలో 32-అంగుళాల హై-డెఫినిషన్ టెలివిజన్‌ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పైగా ఇవన్నీ ఎలాంటి బిల్లులు చెల్లించకుండానే జరగిగాయి.
Aww nah, y’all going to jail. DoorDash not having this 😂😂 pic.twitter.com/kFsfKHmluG
— j (@ItsJB23_) July 8, 2022
ఒక ఫేస్బుక్ వినియోగదారు యాప్ ద్వారా ఆర్డర్ చేసిన టెలివిజన్, వైర్లెస్ కంట్రోలర్ ఫోటోలను షేర్ చేస్తూ డోర్‌డాష్ కు ధన్యవాదాలు తెలిపాడు. వాస్తవానికి ఎంత మంది వ్యక్తులు తమ ఆర్డర్లను అందుకున్నారో ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే కొందరు మాత్రం ఖచ్చితంగా అందుకున్నారు. ఒక వినియోగదారు ” ఆహారం ఉచితంగా పొందాను,” అంటూ తన ఆర్డర్ గురించి వార్త సంస్థకు వెల్లడించింది.
Doordash glitch went crazy im all stocked up free of charge pic.twitter.com/3gvtGZXPtL
— annabelle. (@oomfabelle) July 8, 2022

ఈ వ్యవహారంపై డోర్‌డాష్ ప్రతినిధి న్యూయార్క్ పోస్ట్‌తో మాట్లాడుతూ.. ఫేక్ ఆర్డర్లను ఫాస్ట్ గా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. “జూలై 7న సాయంత్రం డోర్‌డాష్ చెల్లింపు ప్రాసెసింగ్ సమస్యను ఎదుర్కొంది. ఫలితంగా.. కొంతమంది వినియోగదారులు తక్కువ వ్యవధిలో అధికారిక చెల్లింపు పద్ధతి లేకుండా చెక్ అవుట్ చేయగలిగారు” అని సదరు ప్రతినిధి చెప్పారు. “కొందరు వినియోగదారులు ఫేక్ ఆర్డర్లు ఇస్తున్నారని తర్వాత తెలిసిందని, వెంటనే సమస్యను సరిదిద్దినట్లు ఆయన వెల్లడించారు.
Ain’t gone be a wing left in Chicago with this DoorDash glitch going on 🤦🏾♂️🤦🏾♂️🤦🏾♂️ pic.twitter.com/ghqIyF2Ktj
— Follow Da Realest (@Cameron_773) July 8, 2022
English summary
Hundreds of users order free food, alcohol, TVs in america’s DoorDash app due to technical glitch
Hundreds of users order free food, alcohol, TVs in food delivery app know full details
Story first published: Sunday, July 10, 2022, 16:02 [IST]