24 క్యారెట్ల బంగారం..

స్వచ్ఛమైన బంగారాన్ని మూడు వర్గాలుగా విభజించారు. అందులో మొదటిది 24 క్యారెట్ల గోల్డ్. ఈ క్యారెట్ బంగారం 99.99 శాతం స్వచ్ఛమైనది. అయితే.. ఈ క్యారెట్ బంగారాన్ని ఆభరణాల తయారీకి ఉపయోగించరు. కానీ.. దీనిని బంగారు బిస్కెట్లు లేదా ఇటుకల రూపంలో మారుస్తారు.

దాని స్వచ్ఛత కారణంగా.. ఈ క్యారెట్ బంగారం మీ ఆభరణాల పెట్టెలో మాత్రమే కాకుండా సురక్షితంగా ఉంచుతుంది. ఎవరైనా గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్స్ చేయాలనుకుంటే.. వారు 24 క్యారెట్ల బంగారు ఇటుకలు లేదా బిస్కెట్లను కొనుగోలు చేయవచ్చు. 24 క్యారెట్ల బంగారాన్ని ‘999’ గోల్డ్ అని కూడా అంటారు.

22 క్యారెట్ల బంగారం..

22 క్యారెట్ల బంగారం..

మనం 22 క్యారెట్ల బంగారం గురించి మాట్లాడుకున్నట్లయితే.. అది 91.67 శాతం స్వచ్ఛతను కలిగి ఉంటుంది. అయితే, ఇది పూర్తిగా స్వచ్ఛమైనది కాదు. దీనితో ఆభరణాలను తయారు చేస్తారు. ఈ క్వాలిటీ బంగారంలో 8.33 శాతం ఇతర లోహాలను కలుపుతారు. ఈ క్యారెట్ బంగారాన్ని 916 KDM గోల్డ్ అని పిలుస్తారు. దీనితో తయారు చేయబడిన ఆభరణాల్లో 22 భాగాలు బంగారం.., వెండి, జింక్, రాగి వంటి ఇతర లోహాలు 2-2 భాగాలుగా ఉంటాయి.

18 క్యారెట్ల బంగారం..

18 క్యారెట్ల బంగారం..

ఇప్పుడు 18 క్యారెట్ల బంగారం గురించి తెలుసుకుంటే.. ఇది కూడా పూర్తిగా స్వచ్ఛమైనది కాదు. ఇది 75 శాతం వరకు మాత్రమే స్వచ్ఛమైన బంగారంగా పరిగణించబడుతుంది. ఇందులో 18 భాగాలు బంగారం, మిగిలిన 6 భాగాలు ఇతర లోహాలను కలుపుతారు. 75 శాతం బంగారం, 25 శాతం ఇతర లోహాలు కలిపి నగలను తయారు చేస్తారు.

24 క్యారెట్ల గోల్డ్ తో ఆభరణాలను ఎందుకు తయారు చేయకూడదు?

24 క్యారెట్ల గోల్డ్ తో ఆభరణాలను ఎందుకు తయారు చేయకూడదు?

ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు ఏ ఆభరణాలు ఏ కేటగిరీకి చెందినవో ఆభరణాల వ్యాపారి తప్పనిసరిగా చెప్పాలి. అయితే.. ఈ కాలంలో పూర్తిగా స్వచ్ఛమైన అని పిలువబడే 24-క్యారెట్ల బంగారాన్ని చూపించరు. దీని వెనుక కారణం ఈ క్యారెట్ బంగారంతో నగలు చేయకపోవడమే. వాస్తవానికి దాని స్వచ్ఛత కారణంగా.. 24 క్యారెట్ల గోల్డ్ చాలా మృదువుగా ఉంటుంది.

ఈ క్వాలిటీ బంగారంతో చేసే ఆభరణాలు సులువుగా విరిగిపోతాయి. అందుకే ధృడత్వం కోసం ఇతర లోహాలను పరిమిత స్థాయిలో స్వర్ణకారులు కలుపుతారు. కేవలం బంగారంలో ఈ మూడు క్వాలిటీలు మాత్రమే కాకుండా..23, 10, 14, 16 క్యారెట్లు కూడా ఉన్నాయి. కానీ ఈ రకాల బంగారానికి భారత దేశంలో ఎక్కువ ఆదరణ లేదు. ఈ కారణాల వల్లనే వివిధ క్యారెట్ల బంగారం రేట్లలో తేడాలు ఉంటాయి. ప్రజలు తమ ఆర్థిక స్తోమతకు అనుగుణంగా వివిధ క్యారెట్ల బంగారాన్ని కొంటుంటారు.Source link

Leave a Reply

Your email address will not be published.