ఫార్మా కంపెనీ పేరేంటంటే..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ స్టాక్ గురించే. టొరెంట్ ఫార్మాస్యూటికల్స్ షేర్లు పెట్టుబడిదారులకు చాలా మంచి రాబడిని ఇచ్చింది. కొన్నేళ్లలో కంపెనీ షేర్లు రూ.13 నుంచి రూ.2,900 స్థాయిని దాటింది. ఈ విధంగా టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ స్టాక్ దాదాపు 20,000 శాతం బలమైన రాబడిని అందించింది.

ప్రస్తుతం టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ స్టాక్ ఎన్‌ఎస్‌ఈలో రూ. 1465.45 స్థాయిలో ట్రేడవుతోంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 3,304.45గా ఉంది. ఇదే సమయంలో స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ. 2,485గా ఉంది. అయితే ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లిల్లాదర్ ఈ స్టాక్ గార్గెట్ ధర రూ.3,250 చేరుకుంటుదని అంచనావేసినట్లు తాజాగా వెల్లడించింది.

ఉచిత షేర్ ఎలా పొందాలంటే..

ఉచిత షేర్ ఎలా పొందాలంటే..

టొరెంట్ ఫార్మాస్యూటికల్స్ తన పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ బోనస్ షేర్ ప్రతి షేరుకు ఒక షేరుగా(1:1 రేషియోలో) ఉంటుందని కంపెనీ తెలిపింది. టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ డైరెక్టర్ల బోర్డు 11 జూలై 2022న బోనస్ షేర్ల జారీకి రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. అంటే ఈ లేదీలోపు షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు మాత్రమే ఉచిత షేర్లు అందుతాయి.

2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ తన పెట్టుబడిదారులకు 460 శాతం డివిడెండ్ ప్రకటించింది. ఈ డివిడెండ్ ఒక్కో షేరుకు రూ.15గా ఉంది. గత త్రైమాసికంలో కంపెనీ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుకు రూ.25 డివిడెండ్ చెల్లించింది.

ఇన్వెస్టర్లను సంపన్నులుగా మార్చిన కంపెనీ..

ఇన్వెస్టర్లను సంపన్నులుగా మార్చిన కంపెనీ..

టొరెంట్ ఫార్మాస్యూటికల్స్ తన పెట్టుబడిదారులను అనతికాలంలోనే లక్షాధికారులను చేసింది. 20 ఏప్రిల్ 2001న బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ వాటా రూ.12.65 స్థాయిలో ఉంది. కానీ ప్రస్తుతం దాని విలువ రూ. రూ. 1465.45గా ఉంది. అంటే 10 సంవత్సరాల క్రితం ఈ స్టాక్ లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినవారికి.. ప్రస్తుతం రూ. 1.15 కోట్లు పొందేవారు.

NOTE: పైన అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. దీని ఆదారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. మీ ఆర్థిక సలహాదారును సంప్రదించి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవచం ఉత్తమం.Source link

Leave a Reply

Your email address will not be published.