|
ప్రయోజనాలు ఇస్తానంటూ..
బిలియనీర్ ఇప్పుడు తన కంపెనీ సిబ్బంది.. ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండేలా విధానపరమైన మార్పును అమలు చేస్తున్నారు. ఒక ట్వీట్లో టెస్లా ది బోరింగ్ కంపెనీ, స్పేస్ఎక్స్, సోలార్సిటీతో కూడిన తన కంపెనీలు పిల్లల సంరక్షణ ప్రయోజనాలను “గణనీయంగా” పెంచుతాయని పేర్కొన్నాడు. మస్క్ ఫౌండేషన్ “నేరుగా కుటుంబాలకు విరాళం ఇవ్వాలని యోచిస్తోంది” అని చెప్పాడు.
తన వంతు కృషి చేస్తున్నానంటూ..
పిల్లల సంరక్షణ ప్రయోజనాల ప్రత్యేకతలు ప్రస్తుతం తెలియవు. వచ్చే నెలలో మరింత సమాచారం వెలువడుతుందని మస్క్ పేర్కొన్నారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ గత వారం మాట్లాడుతూ “జనాభా తగ్గుదల పరిస్థితికి సహాయం చేయడానికి తన వంతు కృషి చేస్తున్నానని” అన్నారు.

నాగరికత కోసమంటూ..
“నాగరికత ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రమాదం జననాల రేటు తగ్గిపోవడమే” అని కూడా మస్క్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. ఇప్పటికే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్న వారికి శుభాకాంక్షలు తెలిపారు మస్క్. వ్యక్తులు ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండకపోతే, నాగరికత నాసిరకం అవుతుందని, తన మాటలను గుర్తించాలని మస్క్ కోరారు. ఇప్పటికే ఎలాన్ మస్క్ తాజాగా వెలుగులోకి వచ్చిన రహస్య కవలలతో కలుపుకుని 9 మంది పిల్లలకు తండ్రిగా ఉన్నాడు.