News
oi-Mamidi Ayyappa
FD Rates Hike: దేశంలోని రెండవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మళ్లీ పెంచింది. ఈ విషయాన్ని తన వెబ్ సైట్ ద్వారా వెల్లడించింది. ICICI బ్యాంక్ కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇప్పుడు అమలులో ఉన్నాయి. రూ.2 కోట్ల కంటే ఎక్కువ, రూ.5 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై మారిన వడ్డీ రేట్లు వర్తిస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది. గత నెలలో ఆర్బీఐ రెపో రేట్లను పెంచిన నేపథ్యంలో ఐసీఐసీఐ తాజాగా ఎఫ్డీలపై వడ్డీ రేటు పెరిగింది.
ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుతం రూ.2 కోట్ల కంటే ఎక్కువ, రూ.5 కోట్ల కంటే తక్కువ విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.10 శాతం నుంచి 5.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు కాలపరిమితిలో డిపాజిట్లను చేసేవారికి వివిధ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. తాజా పెరుగుదలతో.. 185 రోజుల నుంచి 270 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్డీ వడ్డీ రేట్లు 15 బేసిస్ పాయింట్లు పెంచడంతో 5.25 శాతానికి చేరుకుంది.
అదే 271 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ కాల వ్యవధి ఉన్న డిపాజిట్లపై 5.15 శాతం నుంచి 5.35 శాతానికి పెంచింది. ICICI బ్యాంక్ FDలపై వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు పెరిగింది. 390 రోజుల నుంచి 18 నెలల లోపు నిబంధనలకు 5.35 శాతం నుంచి 5.60 శాతానికి పెరిగాయి.

కొత్తగా మారిన ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ఇప్పడు తెలుసుకుందాం..
7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.10 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.10 శాతం
15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.10 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.10 శాతం
30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.25 శాతం
46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
91 రోజుల నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.75 శాతం
121 రోజుల నుంచి 150 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.75 శాతం
151 రోజుల నుంచి 184 రోజులు: సాధారణ ప్రజలకు – 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.75 శాతం
185 రోజుల నుంచి 210 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.25 శాతం
211 రోజుల నుంచి 270 రోజులు: సాధారణ ప్రజలకు – 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.25 శాతం
271 రోజుల నుంచి 289 రోజులు: సాధారణ ప్రజలకు – 5.35 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.35 శాతం
290 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 5.35 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.35 శాతం
1 సంవత్సరం నుంచి 389 రోజులు: సాధారణ ప్రజలకు – 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.60 శాతం
390 రోజుల నుంచి 15 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.60 శాతం
15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.75 శాతం
English summary
private sector bank icici increased its fixed deposit again
private sector bank icici increased its fixed deposit interest rates on 11 july for different tenures..
Story first published: Tuesday, July 12, 2022, 16:38 [IST]