News
oi-Mamidi Ayyappa
బంగారం అంటే మనకు ఎప్పటికీ ఇష్టమైనదే. ఇన్ని గ్రాములు ఉంటే సరిపోతుంది అని మన దేశంలో ఎవ్వరూ అనుకోరు. అలాంటి బంగారం ధరలు ఏకంగా 9 నెలల దిగువకు చేరుకున్నాయనే వార్త ఇప్పుడు పసిడి ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తుంది. తక్కువ రేటులో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి సైతం ఇది ఎంతగానో అనుకూలమైన సమయమని చెప్పుకోవచ్చు. పైగా రేట్లు పెరిగినప్పుడు వెంటనే డబ్బుగా మార్చుకునేందుకు దీనికన్నా మంచి లోహం ఇంకొకటి లేదు.
గోల్డ్ రేటు తగ్గడానికి కారణం..
గత వారం బలమైన U.S జాబ్ మార్కెట్ డేటా డాలర్ బలపడటానికి కారణమైంది. దీనికి తోడు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ మరోమారు భారీగా వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉన్నందున బంగారం ధరలు పడిపోతున్నాయి. ఈ క్రమంలో గోల్డ్ ప్రస్తుతం 9 నెలల కనిష్ఠాల వద్ద అందుబాటులో ఉంది. ప్రస్తుతం బంగారం ధర ఔన్సుకు 1,736 డాలర్లకు దగ్గరగా ఉంది.

వడ్డీరేట్లు పెరగటం వల్ల చాలా మంది యూఎస్ ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులను తగ్గిస్తున్నారు. దీంతో వారి నుంచి బంగారంపై మక్కువ తగ్గింది. బలమైన లేబర్ మార్కెట్ తరచుగా ఆరోగ్యకరమైన ఆర్థిక సూచికగా పరిగణిస్తున్నందున బులియన్ పై పెట్టుబడులు తగ్గాయి. ఇదే సమయంలో వెండితో పాటు ఇతర ఖరీదైన లోహాలు సైతం కొంత మేర తగ్గాయి.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..
హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో బంగారం ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం ధరలను గమనించినట్లయితే.. బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950; 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,210గా ఉంది.

హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950గా ఉండగా.., 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,210 వద్ద ఉంది. మరోవైపు.. హైదరాబాద్, కేరళ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.63,000గా ఉంది. బెంగళూరులో సైతం వెండి ధరలు రూ.63,000 వద్ద కొనసాగుతున్నాయి.
English summary
gold prices dropped to 9 months lows know full details
gold prices dropped to 9 months lows amid us rate hikes news and good job report of us know latest gold and silver rates..
Story first published: Tuesday, July 12, 2022, 13:39 [IST]