గురు పూర్ణిమ అనేది గురువు మరియు శిష్యుల మధ్య విశ్వాసానికీ ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈరోజున గురువు ఆరాధాన చాలా ముఖ్యమైనది. ఈ పవిత్రమైన రోజున గురువు గారి పాదాలను కడిగి ఆశీస్సులు తీసుకోండి. అలాగే గురు మంత్రాలను జపించాలి. గురువు లేని వారు గురువు పాదాలను పూజించొచ్చు.
గురువుకు బహుమతి..
గురు పూర్ణిమ రోజున మీకు నచ్చే.. మీరు మెచ్చే గురువుకు కొత్త బట్టలు లేదా స్మార్ట్ వాచ్ ఇంకా ఇతర ఏవైనా వస్తువులను బహుమతిగా ఇవ్వొచ్చు. తల్లిదండ్రులను కూడా తొలి గురువులు అంటారు. కాబట్టి వారిని కూడా ఈరోజు ఒక చోట కూర్చోబెట్టి వారి చుట్టూ ప్రదక్షిణలు చేసి, వారి పాదాలను తాకి వారి ఆశీస్సులు తీసుకోండి.
ఈ మంత్రాలను తప్పనిసరిగా పఠించండి..
‘ఓం గురవే నమః’
‘ఓం శ్రీ బృహస్పతి నమః’
ఇలా చేయడం వల్ల మీరు విష్ణుమూర్తిని అనుగ్రహాన్ని కూడా పొందుతారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ప్రాపంచిక సుఖాన్ని పొందడంతో పాటు.. పరలోకంలో కూడా తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు.
ఇలా చేయాలి..
పురాణా ప్రకారం, విష్ణుమూర్తిలో భాగమైన వేద వ్యాసుడు లేకుండా గురు పూజ అనేది ఎప్పటికీ పూర్తి కాదు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున తొలి గురువైన వేద వ్యాసుని పూజించాలి. ఈరోజున గురువుకు సంబంధించిన పురాణాలను లేదా భగవద్గీతను పఠించడం వల్ల మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు విద్యారంగంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అలాగే సత్యనారాయణుడిని ఆరాధించడం మరియు సత్యనారాయణ కథను చదవడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున మీ సామర్థ్యం మేరకు పేదలకు దాన, ధర్మాలు చేయాలి.
చేయకూడని పనులు..
గరు పూర్ణిమ రోజున నల్లని రంగు వస్త్రాలను ధరించొద్దు.
ఈ పవిత్రమైన రోజున మద్యం, మాంసంతో పాటు చెడు పనులు చేయకండి.
ఈరోజున ఎవ్వరిపైనా ఆగ్రహం వ్యక్తం చేయకూడదు.
వీలైనంత మేరకు ఉదయం నుండి రాత్రి వరకు మీ మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.