ఖగోళశాస్త్రం ప్రకారం, ఈ ఏడాది 13 జూలై(July)2022లో అంటే బుధవారం రోజున చంద్రుడు తన క్ష్యలో భూమికి దగ్గరగా రాబోతున్నాడు. ఈ సమయంలో సూపర్ మూన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గురు పూర్ణిమ రోజున ఆకాశంలో మనమంతా ఈ అద్భుతమైన, సుందరమైన దృశ్యాలను మన కళ్లతో నేరుగా చూడొచ్చు. ఈరోజున చంద్రుడు ప్రతిరోజూ సాధారణంగా కనిపించే దాని కంటే అతిపెద్దగా, ప్రకాశవంతంగా గులాబీ రంగులో కనిపించనున్నాడు. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం, సూపర్ మూన్ ఏర్పడే సమయంలో తీర ప్రాంతాలలో తుఫాన్లు, వరదలు వంటి పరిస్థితులు ఏర్పడొచ్చు. ఈ ఏడాది సూపర్ మూన్ ను బుధవారం అంటే జూలై 13వ తేదీ రాత్రి 12:07 గంటలకు చూడొచ్చు. మళ్లీ ఇలాంటి అరుదైన దృశ్యం జూలై మూడో తేదీన కనిపిస్తుంది. ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గురు పూర్ణిమ రోజున కొన్ని రాశుల వారికి అదృష్టం, విజయం లభించనుంది. ముఖ్యంగా ద్వాదశ రాశులలోని నాలుగు రాశుల వారికి అత్యద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి…

1)
మేష రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జూలై 13వ తేదీన చంద్రుడు మకర రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మేషరాశి వారికి కెరీర్ పరంగా శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు చేపట్టిన పనులన్నింటిలోనూ విజయం సాధించే అవకాశం బలంగా ఉంది. మీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.

Guru Purnima 2022 : గురు పూర్ణిమ రోజున ఈ పరిహారాలతో అదృష్టం పెరుగుతుందట…!

2)
కర్కాటక రాశి..
ఈ రాశి నుండి ఏడో స్థానం నుండి చంద్రుడు మకరంలోకి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీకు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు దీర్ఘకాలిక ప్రయాణం చేయొచ్చు. మీ చేతికి ఒక పెద్ద ప్రాజెక్టు రావచ్చు. విహారయాత్రలు కూడా చేసే అవకాశం ఉంది. అయితే మీరు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

3)
తుల రాశి..
ఈ రాశి నుండి చంద్రుడు నాలుగో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీరు మీ ఇంటి మరియు కుటుంబంలోని బాధ్యతలను స్వీకరించేందుకు ఆసక్తి చూపుతారు. ఈ కాలంలో మీకు పనికి సంబంధించి కొన్ని రహస్యాలు తెలిసే అవకాశం ఉంది. ఈ పౌర్ణమి రోజున మీరు బలమైన, నమ్మకమైన పునాదిని నిర్మించుకోవాలనే మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది.

4)
మకర రాశి..
జూలై 13వ తేదీన చంద్రుడు ఇదే రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. మీరు అన్ని రంగాల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ కాలంలో మీరు మీ కోసం మరియు మీ చుట్టూ ఉన్న వారి కోసం చాలా బాధ్యతగా ఉంటారు. మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. మీరు కోరుకున్నవన్నీ నెరవేరే అవకాశం బలంగా కనిపిస్తోంది.Source link

Leave a Reply

Your email address will not be published.