News

oi-Chandrasekhar Rao

|

ముంబై: అంతర్జాతీయంగా మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల్లో తగ్గుదల కొనసాగుతోంది. చాలాకాలం తరువాత 100 డాలర్ల దిగువకు చేరింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ క్రూడాయిల్ 98.88 డాలర్లు పలుకుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌‌లోనూ ఈ ధరలో మరింత క్షీణత కనిపించింది. అక్కడ ఒక బ్యారెల్ క్రూడాయిల్ రేటు 95.28 వద్ద ట్రేడింగ్ అవుతోంది. మంగళవారం నాటితో పోల్చుకుంటే ఇవ్వాళ ఒక శాతం మేర క్రూడ్ ప్రైస్‌లో తగ్గుదల నమోదైంది.

క్రూడాయిల్ రేట్లు తగ్గడం వల్ల దేశీయ చమురు కంపెనీలకు ఊరట లభించినట్టయింది. వాటిపై భారం భారీగా తగ్గినట్టయింది. ఇదివరకు క్రూడాయిల్ బ్యారెల్ ధర 120 నుంచి 123 డాలర్ల వరకు వెళ్లిన నేపథ్యంలో.. కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఇప్పుడు వాటి రేట్లు తగ్గడం వల్ల చమురు కంపెనీలపై ఆర్థిక భారం తగ్గింది. దీన్ని వాహనదారులకు బదలాయిస్తాయా? లేదా? అనేది వేచి చూడాలి.

100 డాలర్లకు దిగువకు క్రూడాయిల్: ఆ కంపెనీలపై తగ్గిన భారీగా భ

దేశీయంగా ఇంధన అమ్మకాల్లో పాత రేట్లే కొనసాగుతున్నాయి. చమురు కంపెనీలు కొద్దిసేపటి కిందటే జారీ చేసిన ధరల ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ111.35 పైసలు, డీజిల్ రూ.97.28 పైసలుగా నమోదైంది. కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది.

చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా నమోదైంది.

అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ 92,38 పైసలు, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి.

రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.. ఇదివరకట్లా. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని కుదించిన అనంతరం మెజారిటీ రాష్ట్రాలు అదే దారిలో నడిచిన విషయం తెలిసిందే.

English summary

Petrol and diesel rates on July 13, 2022: remain unchanged Check here for fuel price in your city

Petrol and diesel rates on July 13, 2022: remain unchanged Check here for fuel price in your city

Story first published: Wednesday, July 13, 2022, 7:08 [IST]



Source link

Leave a Reply

Your email address will not be published.