ప్రపంచ వ్యాప్తంగా మందగమనం..

అధిక ద్రవ్యోల్బణం, ద్రవ్య విధానం కఠినతరం, నిద్రాణమైన ప్రైవేట్ క్యాపెక్స్ వృద్ధి, వీటికి తోడు ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగమనం తాము పరిగణలోకి తీసుకున్నట్లు సంస్థ ఆర్థికవేత్తలు తమ అంచనాలో తెలిపారు. Nomura 2022లో GDP వృద్ధిని 7.2% అంచనా వేస్తుండగా.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7%, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.5% వృద్ధి చెందుతుందని పేర్కొంది. అయితే సేవల రంగం పుంజుకోవటం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కరోనా ముందు స్థాయిలను తిరిగి చేరుకుందని తెలిపింది.

చెల్లింపుల టైం బాంబ్..

చెల్లింపుల టైం బాంబ్..

మరో పక్క వినియోగం,పెట్టుబడి ఇతర రంగాల్లో అభివృద్ధి ఉన్నప్పటికీ ఎగుమతులు మందగించాయి. ఈ క్రమంలో దిగుమతుల పెరుగుదల వాణిజ్య లోటును రికార్డు స్థాయిలకు పెంచుతోంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు టైం బాంబ్ లాంటిదని చెప్పుకోవాలి. ఎందుకంటే రూపాయి పతనంతో పాటు విదేశీ పెట్టుబడులు వెనక్కు తరలిపోతుండగా చెల్లింపులకు అవసరమైన ఫారెక్స్ నిల్వలు వరుసగా క్షీణిస్తున్నాయి.

రిజర్వు బ్యాంక్ గవర్నర్ ఇలా..

రిజర్వు బ్యాంక్ గవర్నర్ ఇలా..

ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసేందుకు చేస్తున్న చర్యల వల్ల గ్రోత్ శాక్రిఫైస్ పరిమితుల్లో ఉండేలా చూసుకుంటున్నట్లు వెల్లడించారు. సెంట్రల్ బ్యాంక్ వీటిని నిశితంగా పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. ఇదే క్రమంలో.. ఆగస్టు ప్రారంభంలో పాలసీ రేట్లను రిజర్వు బ్యాంక్ మళ్లీ పెంచుతుందని అందరూ భావిస్తున్నారు.

ఫిబ్రవరి వరకు వడ్డీ రేట్ల పెంపు..

ఫిబ్రవరి వరకు వడ్డీ రేట్ల పెంపు..

ప్రస్తుతం యూరప్, అమెరికా ఆర్థిక వ్యవస్థలను దృష్టిలోకి తీసుకుని నోమురా టెర్మినల్ పాలసీ రేటును తగ్గించినట్లు వెల్లడించింది. భారత దేశంలో 2023 ఫిబ్రవరి నాటికి వడ్డీ రేట్ల పెంపు(రెపో రేటు పెంపు) ముగుస్తుందని నోమురా అంచనా వేసింది. అప్పటి వరకు ఆగస్టులో 35 బేసిస్ పాయింట్లు, అక్టోబర్, డిసెంబర్, ఫిబ్రవరి నెలల్లో ఒక్కొక్కసారి 25 బేసిస్ పాయింట్ల మేర పెంపు ఉండవచ్చని తన నివేదికలో వెల్లడించింది.Source link

Leave a Reply

Your email address will not be published.