బేర్ మార్కెట్ తాత్కాలికమైనదే..
ఇన్వెస్టర్లు ముందుగా గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, బేర్ మార్కెట్ తాత్కాలికమైనది మాత్రమే. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, మీ మొత్తం ఆర్థిక పరిస్థితిని పరిశీలించండి. దీనికి అనుగుణంగా మీ రిస్క్ సామర్థ్యాన్ని నిర్ణయించుకోండి. మీరు ఆర్థిక నిపుణుల నుంచి అవసరమైన సమాచారాన్ని తెలుసుకోండి. తద్వారా బేర్ మార్కెట్ ఎంతకాలం కొనసాగుతుందనే విషయంపై స్పష్టత వస్తుంది. దీని వల్ల మీరు అనవసరమైన భయాలకు లోనుకాకుండా ఉంటారు.

మంచి విలువ కలిగిన స్టాక్‌లలో పెట్టుబడి..
“ధనవంతులు కావడానికి క్రాష్‌లు ఉత్తమ సమయం” అని రాబర్ట్ కియోసాకి అనేవారు. మార్కెట్ క్రాష్‌లు ఉత్తమ పెట్టుబడి అవకాశాలను అందిస్తాయి. కాబట్టి.. మార్కెట్ల పతనంలో మంచి విలువ గల స్టాక్‌లలో ఇన్వెస్ట్ చేయండి. దీనివల్ల మార్కెట్లు కుదుటపడగానే వారి విలువ పెరుగుతుంది. తద్వారా మంచి రాబడులు అందుకునే అవకాశం ఉంటుంది.

పెట్టుబడి వ్యూహాన్ని రూపొందించండి..
మార్కెట్ అనిశ్చితి సమయంలో మీ పెట్టుబడులను కోల్పోకుండా.. డైవర్సిఫికేషన్ మిమ్మల్ని రక్షిస్తుంది. ఇందుకోసం మీరు అనేక రకాల పెట్టుబడులను కలిగి ఉండాలి. అంటే మీ పెట్టుబడులను స్టాక్‌లు, బాండ్లు, రియల్ ఎస్టేట్ ఫండ్లు, అంతర్జాతీయ సెక్యూరిటీలు, బంగారం, నగదు వంటి వివిధ కేటగిరీల్లో పెట్టుబడిగా పెట్టాలి. దీనివల్ల మీరు నష్టపోయే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది.

దీర్ఘకాలిక పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడి..
స్టాక్ మార్కెట్లు ఎల్లప్పుడూ ఒడిదొడుకులు ఉంటూనే ఉంటాయి. ఇది మార్కెట్లలో అంతర్లీనంగా ఉండటమే కాక.. వాటి పరిణామంలో కూడా ఇది ఒక భాగమని గుర్తుంచుకోండి. మార్కెట్లు క్షీణించినప్పటికీ మళ్లీ క్రమంగా కోలుకుంటాయి. మార్కెట్ కోలుకోవటం అనేది అనేక అంశాలపై ఆదారపడి ఉంటుంది. కొంత మంది బేర్ మార్కెట్ సమయంలో తమ పెట్టుబడులను విక్రయించి వాటిని తిరిగి తక్కువ రేటుకు కొనాలని చూస్తుంటారు. ఇది సరైనది కాదు. అవసరమైతే మరింత పెట్టుబడి తక్కువ రేట్లలో పెట్టి పోర్ట్‌ఫోలియోను యావరేజ్ చేసుకోవచ్చు.

ఈక్విటీ వైపు మరింత వెయిటేజీని ఉంచండి..
పెట్టుబడిదారులు డెట్ భాగాన్ని తగ్గించుకుని ఈక్విటీ వెయిటేజీని పెంచుకోవాలి. ఎందుకంటే తక్కువ రేట్లలో షేర్లను కొనుగోలు చేయడం ఎల్లప్పుడూ దీర్ఘకాలంలో ఉత్తమ రాబడిని ఇస్తుంది. స్టాక్ మార్కెట్ క్రాష్ మీ ఈక్విటీ కేటాయింపును తక్కువ ఖర్చుతో పెంచడానికి సహాయపడుతుంది. పదవీ విరమణ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం మీ పెట్టుబడి రాబడిని పెంచడానికి, ముఖ్యంగా తక్కువ విలువల్లో స్టాక్స్ కొనుగోలు చేసినప్పుడు, ఈక్విటీ పెట్టుబడుల సామర్థ్యం మీకు అర్థమవుతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్లు క్రాష్ అయినప్పుడు ఆందోళన చెందకుండా సరైన రీతిలో ప్లాన్ చేసుకుని మీ సంపదను వృద్ధి చేసుకోండి.