Vastu Tips : శ్రావణంలో ఈ మొక్కలతో పూజిస్తే పరమేశ్వరుని ఆశీస్సులు లభిస్తాయట…
ఇక అసలు విషయానికొస్తే.. ఆషాఢ మాసంలో కొత్త జంటలు, కొత్త కోడలు అత్తమ్మ ముఖాన్ని అస్సలు చూడకూడదు అంటారు. ఈ సమయంలో కొత్త వధువును కచ్చితంగా పుట్టింటికి పంపుతారు. భార్యభర్తలు ఈ మాసంలో కలయికలో పాల్గొని గర్భం దాలిస్తే వేసవిలో డెలివరీ జరుగుతుంది. ఈ కాలంలో తల్లీ,బిడ్డలకు అనారోగ్య సమస్యలు, రోగాలు వస్తాయనే కారణంతో ఈ నెలలో కొత్త జంటలు కలవకూడదనే ఆచారాన్ని తీసుకొచ్చారు.
వేసవికాలంలో కొత్త వధువుకు అత్తగారింట్లో అసౌకర్యంగా ఉండటం వల్ల అత్తాకోడళ్ల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ మాసంలో కొత్త పెళ్లికూతురిని పుట్టింటికి పంపుతారు.
ఆషాఢ మాసంలో వర్షాలు అధికంగా కురుస్తాయి. ఈ నెలలో తొలకరి చినుకులు పడి, వ్యవసాయానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో అన్నదాతలు కష్టపడితేనే మనకు ఆహారం దొరుకుతుంది. అయితే ఈ కాలంలో కొత్త పెళ్లికొడుకు తన భాగస్వామి మీద మోజుతో వ్యవసాయ పనులకు దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ మాసంలో కొత్త వధువును కచ్చితంగా పుట్టింటికి పంపుతారని పెద్దలు చెబుతారు.