సమయానికి రుణ చెల్లింపులు చేయకపోతే..

మీ క్రెడిట్ స్కోర్ త‌గ్గటానికి ప్రధాన కారణంగా సమయానికి లోన్స్ చెల్లింపులు చేయకపోవటం. కొన్ని సార్లు మన ప్రమేయం లేకుండా కూడా ఇది తగ్గవచ్చు. అలాంటి సందర్భంలో మీకు తెలియ‌కుండా ఏదైనా రుణం ఖాతా మీ అకౌంట్ లో చేర్చబడిందేమో తెలుసుకోండి. ఏ కారణంగానైనా మీ చెల్లింపులు లేటయ్యాయేమో చెక్ చేసుకోండి. మరో సారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడండి. కొన్ని సందర్భాల్లో అనేక కారణాల వల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతినవచ్చని గుర్తుంచుకోండి. వెంటనే అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపడితే క్రెడిట్ స్కోర్ తిరిగి పుంజుకుంటుంది.

ఈఎంఐ చెల్లింపుల్లో బ్రేక్ వద్దు..

ఈఎంఐ చెల్లింపుల్లో బ్రేక్ వద్దు..

కొన్ని సార్లు అనుకోని సందర్భాల్లో ఈఎంఐ చెల్లింపులు ఆల‌స్యం కావచ్చు. ఫైన్ చెల్లించాం కదా అని నిర్లక్ష్యంగా ఇదే తప్పు అనేకమార్లు కొనసాగిస్తే అది క్రెడిట్ స్కోర్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. అందువల్ల గడువు ప్ర‌కారం నెల‌వారీ వాయిదాల చెల్లింపులు చేయటం మంచిది. దీన్ని ప‌ట్టించుకోకుంటే భ‌విష్య‌త్‌లో ఇబ్బందులు కలుగుతాయి. అంటే అవసరానికి లోన్ దొరక్కపోవచ్చు లేదా అధిక వడ్డీలకు లోన్ తీసుకోవలసి రావచ్చని గుర్తుంచుకోండి.

క్రెడిట్ కార్డ్ పూర్తి లిమిట్ వాడొద్దు..

క్రెడిట్ కార్డ్ పూర్తి లిమిట్ వాడొద్దు..

క్రెడిట్ కార్డులను కలిగి ఉండటం మంచిదే. ఎందుకంటే అవి అనేక సార్లు తక్కువ ధరలకే వస్తువులు, సేవలను పొందటానికి ఉపయోగపడతాయి. కానీ.. వాటిని పూర్తి లిమిట్ వరకు వాడకూడదు. మనకు కేటాయింటిన మెుత్తం లిమిట్ లో 30 శాతం వరకు వాడుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ క్రెడిట్ స్కోర్ వృద్ధి చెందుతుంది.

ఫుల్ లిమిట్ వరకు క్రెడిట్ వాడటం వల్ల మీరు ఎక్కువ రుణాలపై ఆదారపడుతున్నారని భావించి క్రెడిట్ రేటింగ్ సంస్థలు మీ క్రెడిట్ స్కోర్ ను తగ్గించే ప్రమాదం ఉంటుంది. ఇదే సమయంలో అధిక రుణాల కోసం అనేక ఫైనాన్స్ సంస్థలకు దరఖాస్తులు అస్సలు చేసుకోవద్దు. ఇలాంటి పనులు మీ క్రెడిట్ స్కోర్ ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఒక రుణం ఉండగా మరొకటి వద్దు. కావాలంటే ఉన్న రుణాన్ని తీర్చేసి మరో పెద్ద రుణం తీసుకోవటం మంచిదని గుర్తుంచుకోండి.

క్రెడిట్ కార్డు రద్దు చేసుకుంటే నష్టం ఇలా..

క్రెడిట్ కార్డు రద్దు చేసుకుంటే నష్టం ఇలా..

అనేక సంవత్సరాలుగా వాడుతున్న క్రెడిట్ కార్డులను రద్దు చేసుకోవటం వల్ల కూడా మీ క్రెడిట్ స్కోర్ తాత్కాలికంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే.. ఇప్పటి దాకా ఉన్న మీ క్రెడిట్ హిస్టరీ మెుత్తం కార్డుతో పాటే పోతుంది. ఈ ప్రభావం సుమారు 7 సంవత్సరాల వరకు ఉంటుందని నిపుణులు అంటున్నారు.

అందువల్ల ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నాయనో, అవసరం లేదనో ఉన్న క్రెడిట్ కార్డును రద్దు చేసుకోవద్దు. సాధ్యమైనంత వరకు ఇలాంటి తప్పులకు దూరంగా ఉండటంతో పాటు మన పేరుపై అక్రమంగా ఎవరైనా రుణాలు తీసుకున్నారేమో గమనిస్తూ ఉండండి. కొన్ని సార్లు సైబర్ నేరగాళ్లు, లోన్ యాప్స్ లో జరిగే మోసాల వల్ల మనం తీసుకోని రుణాలకు కూడా మనం బలి కావలసి ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు మీ క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ పరిశీలించి తప్పిదాలు గమనిస్తే వాటిని సరిదిద్దుకోండి.Source link

Leave a Reply

Your email address will not be published.