హర్షద్ మెహతా..

దాదాపు 20 ఏళ్ల క్రితం హర్షద్ మెహతా పేరు మీడియాలో కథనాల్లో సంచలనంగా మారింది. హర్షద్ మెహతా ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. అతని సోదరుడు హర్షద్ మెహతాతో కలిసి గ్రోమోర్ అనే బ్రోకరేజ్ సంస్థను స్థాపించి 1987లో స్టాక్ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. స్టాక్ మార్కెట్ లో లొసుగులను వినియోగించి కోట్లకు పడగలెత్తినట్లు 1992లో వెలుగులోకి వచ్చింది. షేర్ల కొనుగోలుకు బ్యాంకులోని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు తేలటంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

 బిగ్ బుల్ పతనం..

బిగ్ బుల్ పతనం..

హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక్కసారిగా కుదిపేసింది. ఈ వార్తకు SCAM అనే హెడ్ లైన్ తొలిసారిగా వార్తా పత్రికల్లో హెడ్డింగ్ గా మారింది. దీని తరువాత కొత్తగా అనేక కఠిన చట్టాలను దేశంలో తీసుకురావటం జరిగింది. స్టాక్ మార్కెట్లో మెహతా ఎంత ఎత్తుకు ఎదిగారో అదే విదంగా పాతాళానికి చేరుకున్నారు.

జైలులో మరణం..

జైలులో మరణం..

2001లో హర్షద్ మెహతా జైలులో గుండెపోటుతో మరణించినప్పుడు అసలు జరిగిన నిర్లక్ష్యం గురించి, జైలు అధికారులు స్పందన గురించి అనేక వాస్తవాలను harshadmehta.inలో జ్యోతి పొందుపరిచారు. ఆయనది సాధారణ మరణం కాదని, వైద్యం అందించటంలో జరిగిన అలసత్వమేనని ఆమె చెప్పారు. 47 ఏళ్ల పాటు ఆరోగ్యంగా ఉన్న మెహతా చివరికి డిసెంబర్ 30, 2001న జైలులో అకస్మాత్తుగా మరణించారు. అయితే అంకుముందు మెహతాకు ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు లేవని భార్య జ్యోతి పేర్కొంది.

జైలు అధికారుల నిర్లక్ష్యం ఇలా..

జైలు అధికారుల నిర్లక్ష్యం ఇలా..

హర్షద్ మెహతాకు గుండెపోటు వచ్చిన మొదటి 4 గంటలు క్రిటికల్‌గా ఉన్నట్టు జైలు గార్డులకు తెలిసినా, ఆ నాలుగు గంటల్లో జైలు అధికారులు ఆయనకు చికిత్స చేసేందుకు ముందుకు రాలేదని, జైలు అధికారులు తనకు సమాచారం కూడా ఇవ్వలేదని జ్యోతి తన వెబ్‌సైట్‌లో వెల్లడించారు. ఆ సమయంలో తన గుండెపోటు గురించి మెహతా పక్క సెల్‌లో ఉన్న సోదరుడికి సమాచారం అందించారని పేర్కొన్నారు. జైలు వైద్యులు పరీక్షించినప్పుడు గుండెపోటు మాత్రలు లేవనడంతో.. హర్షద్ మెహతా తన మెడికల్ బాక్స్‌లో మందు అడిగి తెలుసుకున్నారు. ఆ మందు నాలుగు గంటలపాటు మెహతాను బతికించిందని జ్యోతి తెలిపారు.

దర్యాప్తు నివేదిక వాస్తవాలు..

దర్యాప్తు నివేదిక వాస్తవాలు..

గంటల పాటు ఆలస్యం తర్వాత జైలు అధికారులు మెహతాను ఆసుపత్రికి తీసుకెళ్లారని, ఆపై తనకు రెండవసారి గుండెపోటు వచ్చి వీల్ చైర్‌లోనే చనిపోయారని జ్యోతి వెల్లడించారు. తన భర్త మరణానికి సంబంధించి అధికారులు ఎలాంటి విచారణ నివేదిక, పోస్ట్‌మార్టం నివేదిక ఇవ్వలేదని.. దీనికోసం జైలు అధికారులను ఎన్నిసార్లు కోరినప్పటికీ స్పందన లేదని చెప్పారు.

వైద్యుని ద్వారా నిజాలు..

వైద్యుని ద్వారా నిజాలు..

భర్త చనిపోతున్న ఆఖరి క్షణంలో అతడికి అండగా నిలవలేకపోతున్నామని, వైద్యుడి ద్వారా ఎన్నో నిజాలు తెలుసుకున్నామని, మా పరిస్థితి శత్రువుకి కూడా రాకూడదని కోరుతున్నట్లు జ్యోతి వెబ్ సైట్ లో నమోదు చేశారు. జ్యోతి మెహతా పెట్టిన ఈ పోస్ట్ భారీ స్థాయిలో వైరల్ అవుతుండడం గమనార్హం.Source link

Leave a Reply

Your email address will not be published.