News
oi-Mamidi Ayyappa
T-Hub News: ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఎనేబుల్లర్ T-Hub.. పొంటాక్‌తో తన భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఇది యూకే, ఇండియా, యూఎస్ఏ, కెనడా అంతటా ప్రారంభ దశ సాంకేతిక వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టే క్రాస్-బోర్డర్ ఇన్నోవేషన్ ఫండ్.
ఒక సంవత్సరం కోసం చేసుకున్న ఈ ఒప్పందం ప్రకారం.. T-Hub దాని కొత్త భవనంలో పొంటాక్కు కార్యాలయ స్థలాన్ని అందిస్తుంది. T-హబ్‌లో ఇంక్యుబేట్ అయిన స్టార్టప్‌లు యూకే మార్కెట్లలోకి విస్తరించేందుకు వీలుగా UK-ఇండియా కారిడార్‌లోని T-హబ్‌కు పొంటాక్ పెట్టుబడి భాగస్వామిగా ఉంటుంది.

T-Hub, Pontaq భారత్, యూకేలో స్టార్టప్‌ల వృద్ధి కోసం నిధుల అవకాశాలను అన్‌లాక్ చేయడానికి కృషి చేస్తున్నట్లు T-HUB CEO మహంకాళి శ్రీనివాస్ రావు తెలిపారు. అంటే దీని వల్ల స్టార్టప్ కంపెనీలు ఇతర దేశాల నుంచి తమ ఆలోచనలకు అవసరమైన పెట్టుబడులను పొందేందుకు మార్గం సుగమం కానుంది.
తెలంగాణ రాష్ట్రంతో పాటు టీ-హబ్ తమ Myneibo, Maxbyte Technologies పోర్ట్ ఫోలియో కంపెనీలను కేవలం ఆరు వారాల్లోనే తెలంగాణలోకి ప్రవేశించేలా చేసినట్లు పొంటాక్ మేనేజింగ్ పార్టనర్ ప్రేమ్ బర్థసారథి తెలిపారు. త్వరలోనే 20 మందిని నియమించుకుంటున్నట్లు తెలిపారు. స్థానిక ఉద్యోగాల సృష్టిలో తమ కంపెనీలు సహాయం చేస్తాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికే పొంటాక్ ద్వారా నాలుగు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు. ఈ ఏడాది మరో ఐదు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రేమ్ బర్థసారథి వెల్లడించారు.
English summary
T-Hub, Pontaq partnership to support startups
telanganas prestagious T-Hub partnered with Pontaq to support startups enter uk markets too ..
Story first published: Thursday, July 14, 2022, 14:51 [IST]