News
oi-Chandrasekhar Rao
ముంబై: అంతర్జాతీయంగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు.. దేశీయ బులియన్ మార్కెట్‌పై ఎప్పటికప్పుడు ప్రభావాన్ని చూపుతుంటాయి. దాని వల్ల బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటోంటాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం, రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలల తరబడి కొనసాగుతూ వస్తోన్న యుద్ధం వంటి పరిస్థితులు వాటి రేట్లను ప్రభావితం చేస్తోంటాయి. ఈ వారం బులియన్ మార్కెట్ ధరలు ఎలా ఉండొచ్చనే విషయం మీద అంచనాలు ఏర్పడ్డాయి.
ఇవ్వాళ కూడా బంగారం ధరల్లో క్షీణత కనిపించింది. వాటి రేట్లు తగ్గాయి. ఈ వారం మొదట్లో స్థిరంగా ఉన్నప్పటికీ.. ఆ తరువాత పసిడి రేట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో పడిపోతూ వచ్చాయి. ఈ ట్రెండ్ కొనసాగుతోంది. 50 వేల రూపాయలకు చేరుకుంది. చెన్నై బులియన్ మార్కెట్లో ఇవ్వాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,580 రూపాయలకు చేరింది. ఈ స్థాయిలో ధరలు తగ్గడం వల్ల పలు నగరాల్లో కొనుగోళ్లు పెరిగాయి. 50 వేల రూపాయల కంటే దిగువకు చేరడానికి ఇక ఎంతోకాలం పట్టకపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల బులియన్ మార్కెట్లల్లో భారీ ఎత్తున బంగారం కొనుగోళ్లు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు 50,730 రూపాయలు. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 50,730, ఢిల్లీ-50,730, కోల్‌కత-50,730, బెంగళూరు-50,820 రూపాయలుగా నమోదైంది.
తిరువనంతపురం బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 50,730, పుణె-50,760, వడోదర-50,760, అహ్మదాబాద్-50,770, జైపూర్-50,890, లక్నో-50,890, కోయంబత్తూరు-50,580, మధురై-50,580, విజయవాడ-50,730, పాట్నా-50,760, నాగ్‌పూర్-50,760, చండీగఢ్-50,890, సూరత్-50,770, భువనేశ్వర్-50,730, మంగళూరు-50,820, విశాఖపట్నం-50,730, నాసిక్-50,760, మైసూర్-50,820 రూపాయలు పలుకుతోంది.
English summary
Yellow metal today on July 15, 2022: Check Revised Rates of Gold here
Yellow metal today on July 15, 2022: Check Revised Rates of Gold here.
Story first published: Friday, July 15, 2022, 12:27 [IST]