లాభపడే స్టాక్స్ ఇవే..

రూపాయి విలువ పతనం వల్ల ఐటీ రంగ కంపెనీల స్టాక్స్ లాభపడనున్నాయి. వీటిలో టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, మైండ్‌ట్రీ కంపెనీలు ఉన్నాయి. ఎందుకంటే వారి సంపాదనలో ఎక్కువ భాగం డాలర్ల రూపంలో విదేశాల నుంచి వస్తుంది. ఐటీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఇదో మంచి అవకాశమని అవెండస్ క్యాపిటల్ సీఈవో ఆండ్రూ హాలండ్ అన్నారు. ఈ స్టాక్‌లు ఇప్పుడు చౌకగా అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు భారీ రాబడులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

 కంపెనీలకు సంపాదన ఇలా..

కంపెనీలకు సంపాదన ఇలా..

TCS సంపాదనలో 50 శాతం US నుంచే వస్తోంది. అదేవిధంగా.. ఇన్ఫోసిస్ ఆదాయంలో 60 శాతం ఉత్తర అమెరికా నుంచే వస్తోంది. HCL సంపాదనలో 55 శాతం వరకు US నుంచి మాత్రమే వస్తోంది. అయితే.. మార్జిన్లపై ప్రభావం వల్ల ఐటీ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. అలాగే.. యూరప్‌లో మాంద్యం భయాలు కూడా ఈ స్టాక్‌లను ప్రభావితం చేశాయి. రూపాయి పతనంతో ఐటీ స్టాక్స్‌తో పాటు దివీస్ లేబొరేటరీస్, బాలకృష్ణ ఇండస్ట్రీస్ వంటి ఎగుమతి ఆధారిత కంపెనీలు కూడా లాభపడతాయి. గత నెల రోజుల్లో దివీస్ ల్యాబ్ షేర్లు 4.5 శాతం, బాలకృష్ణ ఇండస్ట్రీస్ 6.3 శాతం చొప్పున లాభపడ్డాయి.

ఈ షేర్లు నష్టాలను చవిచూడవచ్చు..!

ఈ షేర్లు నష్టాలను చవిచూడవచ్చు..!

మరోవైపు.. రూపాయి పతనంతో దిగుమతి చేసుకునే కంపెనీల షేర్లు ప్రభావితం కావచ్చని తెలుస్తోంది. వీటిలో విదేశాల నుంచి ముడిసరుకు దిగుమతి చేసుకునే కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో పెయింట్ తయారీదారులైన ఏషియన్ పెయింట్స్, బెర్గర్ పెయింట్స్ ఉన్నాయి. రూపాయి విలువ పతనం ఈ కంపెనీల దిగుమతి బిల్లును పెంచుతోంది. దీంతో పాటు టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పిడిలైట్ ఇండస్ట్రీస్, ఆస్ట్రల్, సుప్రీమ్ ఇండస్ట్రీస్ వంటి బడా కంపెనీలు కూడా రూపాయి పతనంతో నష్టపోనున్నాయి.Source link

Leave a Reply

Your email address will not be published.