కంపెనీ వ్యాపారం..

మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న స్టాక్ సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ షేర్ గురించే. కేవలం రెండు సంవత్సరాల్లోనే ఈ స్టాక్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. కంపెనీ షేరు ధర జూలై 14, 2020న రూ.8.38గా ఉంది. ఈ స్టాక్ ధర జూలై 15, 2022న రూ.201.05కి చేరుకుంది. CG పవర్ & ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ దేశంలోని ఒక బహుళజాతి సంస్థ, విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్ మిషన్, రైలు రవాణా కోసం పరికరాల రూపకల్పన, తయారీ, మార్కెటింగ్‌లో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.

కొత్త కంపెనీ చేతిలోకి..

కొత్త కంపెనీ చేతిలోకి..

గతంలో ఈ కంపెనీని క్రాంప్టన్ గ్రీవ్స్ లిమిటెడ్ అని పిలిచేవారు. సంస్థ వ్యాపారం అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉంది. కంపెనీ ట్రాన్స్‌ఫార్మర్లు, స్విచ్‌గేర్, సర్క్యూట్ బ్రేకర్లు, నెట్‌వర్క్ ప్రొటెక్షన్, కంట్రోల్ గేర్, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్, హెచ్‌టీ, ఎల్‌టీ మోటార్లు, డ్రైవ్‌లు, పవర్ ఆటోమేషన్ ఉత్పత్తులు, టర్న్‌కీ సొల్యూషన్‌ రంగాల్లో ఉంది. ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా ఈ కంపెనీని నవంబర్ 2020లో కొనుగోలు చేసింది. దీని తరువాత.. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలు మొదటిసారి కొత్త నిర్వహణలో పని చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీకి చాలా కీలకమైనది. కంపెనీ వ్యాపారులు, వినియోగదారుల నుంచి మంచి ఆదరణను పొందింది. దీనితో పాటు కంపెనీ ఫైనాన్షియల్ రేటింగ్ కూడా మెరుగుపడింది.

భారీగా పెరిగిన ఆదాయం..

భారీగా పెరిగిన ఆదాయం..

ప్రస్తుతం కంపెనీ నికర ఆదాయం 87.69% పెరిగింది. 2021 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవర్ రూ.2963.95 కోట్లు కాగా.. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.5561.40 కోట్లకు పెరిగింది. అలాగే కంపెనీ పీబీఐడీటీ కూడా 206 శాతం పెరిగి రూ.697.20 కోట్లకు చేరుకుంది. అయితే టాక్సుల చెల్లింపు తరువాత లాభాలు 28.6 శాతం క్షీణించి రూ.913.42 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అనూహ్యంగా లాభపడడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

పెట్టుబడిపై రాబడి ఇలా..

పెట్టుబడిపై రాబడి ఇలా..

ఈ స్టాక్ లో రెండు సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే.. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం దాని విలువ రూ.24 లక్షలకు చేరుకుని ఉండేది. అంటే దీర్ఘకాలంలో ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు మంచి రాబడులను అందించింది ఈ మల్టీ బ్యాగర్ పెన్సీ స్టాక్. ఈ స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ. 71గా ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర రూ.219.60గా ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ తన 52 వారాల గరిష్ఠానికి చేరువలో ట్రేడ్ అవుతోంది.Source link

Leave a Reply

Your email address will not be published.