వారెన్ బఫెట్..

ప్రపంచానికి ఆర్థిక పాఠాలు నేర్పిన వ్యక్తి వారెన్ బఫెట్. ఆయన బాటలో నడిచి ఆర్థిక అంశాలలో విజయాలు సాధించిన వారు అనేక మంది. పెట్టుబడులు ఎలా పెట్టాలి, ఫైనాన్స్ మేనేజే మెంట్ ఎలా ఉండాలి, ప్రణాళికతో పెట్టుబడులు పెట్టడం ఎలా, వృధాగా వేటిపై ఇన్వెస్ట్ చేస్తే ఆర్థికంగా నష్టపోతారు వంటి అనేక విషయాలు బఫెట్ నుంచే నేర్చుకోవాలి. ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్న కంపెనీ ఈయనకు సంబంధించినదే.

స్టాక్ వివరాలు..

స్టాక్ వివరాలు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఖరీదైన స్టాక్ Berkshire Hathaway Inc కంపెనీదే. ఈ కంపెనీకి చెందిన ఒక షేరు ధర ప్రస్తుతం భారత కరెన్సీ ప్రకారం రూ.3.33 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ విలువ 4,17,250 డాలర్లు అంటే రూ.3,33,43,907గా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 20న ఈ షేర్ విలువ 5,23,550 డాలర్లకు చేరుకుంది. మన కరెన్సీ ప్రకారం దాని విలువ రూ.4,00,19,376. అంటే.. గత మూడు నెలల్లో ఈ స్టాక్ దాదాపు 20 శాతం పడిపోయింది. కానీ.. ఈ ఒక్క షేర్‌తో మీరు ఇల్లు, కారు, లగ్జరీ వస్తువులు ఇలా విలాసవంతమైన వస్తువులను సులువుగా కొనుగోలు చేయవచ్చు.

సామాన్యులు ఈ స్టాక్‌ను కొనగలరా..?

సామాన్యులు ఈ స్టాక్‌ను కొనగలరా..?

ఈ స్టాక్‌ను కొనుగోలు చేయడం చాలా మంది సామాన్యుల ఏకైక కల. ఇప్పుడు ఈ బెర్క్‌షైర్ హాత్వే ఇంక్ కంపెనీకి అధిపతి ప్రపంచ ప్రముఖ పెట్టుబడిదారు వారెన్ బఫెట్‌. ఈ కంపెనీలో ఆయనకు 16 శాతం వాటా ఉంది. కంపెనీ వ్యాపారంలో ఎక్కువ భాగం అమెరికాలోనే ఉంది. కంపెనీలో దాదాపు 3,72,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. బెర్క్‌షైర్ హాత్వే ఇంక్ అమెరికాతో పాటు చైనాలోనూ విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. 1965లో వారెన్ బఫెట్ ఈ టెక్స్‌టైల్ కంపెనీని కొనుగోలు చేసినప్పుడు ఒక్కో షేర్ విలువ 20 డాలర్ల కంటే తక్కువగా ఉంది.Source link

Leave a Reply

Your email address will not be published.