today telugu panchangam : హిందూ మరియు వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పంచాంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే మన భారతీయులు శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇతర ఆచార వ్యవహారాల నిమిత్తం పంచాంగాన్ని పక్కాగా చూస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగం అంటారు. ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి ముఖ్యమైన విషయాల గురించి వివరిస్తుంది. పంచాగం లెక్కించడానికి అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికీ సూర్యమానం, చాంద్ర మానం విధానాలనే అనుసరిస్తున్నారు. సూర్యుడి సంచారంతో అనుసంధానమైనది సూర్యమాన పంచాంగం, అదే విధంగా చంద్రుని సంచారంతో అనుసంధానమైనది చంద్రుని పంచాంగం. మన తెలుగువారు ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. అందుకే చాంద్రమానం ప్రకారం, తెలుగు నూతన సంవత్సరం ఛైత్ర మాసంతో ప్రారంభమవుతుంది. ఫాల్గుణ మాసంతో ముగుస్తుంది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. ఈ సందర్భంగా నేటి 15 జూలై(July) శుక్రవారం వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రాష్ట్రీయ ఆషాఢ మితి 24, శాఖ సంవత్సరం 1944, ఆషాఢ శుక్ల, అష్టమి, గురువారం, విక్రమ సంవత్సరం 2079. సౌర ఆషాఢ మాసం ప్రవేశం 31, జిల్హిజా 15, హిజ్రీ 1443(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 15 జూలై 2022
సూర్యుడు దక్షిణయానం నుండి ఉత్తర ప్రదక్షిణ, వర్ష బుుతువు.

Vastu Tips : శ్రావణంలో ఈ మొక్కలతో పూజిస్తే పరమేశ్వరుని ఆశీస్సులు లభిస్తాయట…

రాహుకాలం : ఉదయం 10:30 గంటలకు, విధియ తిథి సాయంత్రం 4:40 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. అనంతరం తదియ తిథి ప్రారంభమవుతుంది. శ్రావణ నక్షత్రం సాయంత్రం 5:32 గంటల తర్వాత ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది.

తైతిల్ కరణం ప్రారంభమైన తర్వాత ఉదయం 4:17 గంటల వరకు, ఈరోజు చంద్రుడు మకరరాశిలో నుండి కుంభరాశిలోకి సంచారం చేస్తారు. ఈరోజు అర్ధరాత్రి 12:21 గంటలకు ప్రీతి యోగం తర్వాత ఆయుష్మాన్ యోగం ప్రారంభమవుతుంది.

సూర్యోదయం సమయం 15 జులై 2022: ఉదయం 5:33 గంటలకు
సూర్యాస్తమయం సమయం 15 జులై 2022 : సాయంత్రం 7:21 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..
బ్రహ్మా ముహుర్తం : తెల్లవారుజామున 4:11 నుండి 4:52 గంటల వరకు
విజయ ముహుర్తం : జూలై 16వ తేదీ అర్ధరాత్రి 12:07 నుండి మరుసటి రోజు తెల్లవారుజామున 12:48 గంటల వరకు
నిశిత కాలం : తెల్లవారుజామున 12:48 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 7:07 నుండి సాయంత్రం 7:31 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు
యమగండం : మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు
దుర్ముహర్తం : ఉదయం 8:19 నుండి ఉదయం 9:14 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 12:55 నుండి మధ్యాహ్నం 1:50 గంటల వరకు
భద్ర కాలం : జూలై 16వ తేదీ మధ్యాహ్నం 2:59 నుండి మరుసటి రోజు ఉదయం 5:34 గంటల వరకు

– ఆచార్య కృష్ణ దత్త శర్మ



Source link

Leave a Reply

Your email address will not be published.