పూజలో పూలు, నైవేద్యాలకు నియమం

మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరబాటున క్రింద పడినా వాటిని పూజకు ఉపయోగించకూడదు. వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు. ఎండిన పూలను పూజగదిలో ఉంచటం ఏ మాత్రం మంచిది కాదు. పూజ సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని, మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు. కాబట్టి, ఏ దేవునికి ఏమి సమర్పించాలో తెలుసుకొని, ఆయా దేవుళ్లకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలు పెడితే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక అంతే కాదు నైవేద్యాన్ని శుచి, శుభ్రతతో తయారు చేసినవి, ఎలాంటి ఎంగిలి లేనివి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.

 పూజ చేసే ముందు నోటితో అశుభాలు మాట్లాడకూడదు

పూజ చేసే ముందు నోటితో అశుభాలు మాట్లాడకూడదు

పూజలు చేసేముందు నోటితో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు. అంతేకాదు ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. భగవంతుని పూజకు మంత్రాలు చదవడానికి ఉపయోగించే నోటిని కచ్చితంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వచ్చీ రాని మంత్రాలు చదవకూడదు. తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు. దుర్వాసనతో కూడిన నోటితో మంత్రాలను పఠించడం కూడా అశుభమైనదిగా పరిగణించబడుతుంది. పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్ధాన్ని నమలరాదు.

పూజలు చెయ్యటానికి కచ్చితంగా తలస్నానం చెయ్యాల్సిందే

పూజలు చెయ్యటానికి కచ్చితంగా తలస్నానం చెయ్యాల్సిందే

ఇక పూజలు చేసేటప్పుడు కచ్చితంగా తల స్నానం చేయాలని సూచించబడింది. అపరిశుభ్రమైన జుట్టు మరియు నోటి దుర్వాసనతో పూజ చేయడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతారు . పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ ధరించకూడదు. చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని , దేవతలు నిరాశ చెందుతారని చెప్తారు. కాబట్టి, పూజ సమయంలో చక్కగా మరియు ఉతికిన బట్టలు ధరించాలి. కొత్త బట్టలు ధరించడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది.

 దీపాన్ని మరో దీపంతో వెలిగించకూడదు, దక్షిణానికి దీపం పెట్టకూడదు

దీపాన్ని మరో దీపంతో వెలిగించకూడదు, దక్షిణానికి దీపం పెట్టకూడదు

కరిగిన నెయ్యి లేదా ద్రవ చందనాన్ని ఏ దేవునికి సమర్పించవద్దని చెబుతారు. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడూ వెలిగించవద్దని చెబుతున్నారు. ఇది పేదరికాన్ని కలిగిస్తుందని అనారోగ్యానికి కారణం అవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు.

దేవుడి పూజ సమయంలో మనసు దేవుడి పైనే .. లేదంటే సత్ఫలితాలు రావు

దేవుడి పూజ సమయంలో మనసు దేవుడి పైనే .. లేదంటే సత్ఫలితాలు రావు

దేవుళ్ళకు విగ్రహాలకి అభిషేకం చేసే సమయంలో, బొటన వేలితో విగ్రహాన్ని రుద్దకూడదు. వంట గదిలోని వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు. ఇలా చేయడం దేవుళ్లకు చికాకు వస్తుందని చెబుతున్నారు. దేవుడి పూజకు వాడే పసుపు, కుంకుమతో పాటు అన్ని వస్తువులను సపరేట్ గా పెట్టుకోవాలి. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు. వారి పట్ల కూడా గౌరవాన్ని ప్రదర్శించాలి. పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిధులు దైవ సమానులని చెప్తారు. అన్నిటి కంటే ముఖ్యంగా పూజ చేసే సమయంలో మనసు దేవుడి మీదే లగ్నం చెయ్యాలి. ఇంట్లో పనుల మీదనో, టీవీ తదితరాల మీదనో లగ్నం చెయ్యటం వల్ల మంచి ఫలితాలు రావు.Source link

Leave a Reply

Your email address will not be published.