Feature
oi-M N Charya
గ్రహాలకు
సంబధించిన
మొక్కలు
డా.
ఎం.
ఎన్.
ఆచార్య
–
ప్రముఖ
అంతర్జాతీయ
జ్యోతిష,
జాతక,
వాస్తు
శాస్త్ర
పండితులు
–
శ్రీమన్నారాయణ
ఉపాసకులు.
సునంద
రాజన్
జ్యోతిష,
జాతక,
వాస్తు
కేంద్రం.
తార్నాక
-హైదరాబాద్
–
ఫోన్:
9440611151
వృక్షో
రక్షతి
రక్షితః
అనగా
చెట్టును
మనంకాపాడితే
ఆ
చెట్టు
మనల్ని
కాపాడుతుంది
అని
అర్ధం.
మనిషి
లేకపోయినా
చెట్లు,
నీరు,
గాలి
తదితరాలతో
నిండి
ఉన్న
ప్రకృతికి
ఏమీకాదు.
కానీ
ప్రకృతి
లేకుంటే
మానవ
మనుగడే
ప్రశ్నార్ధక
మవుతుంది.
అందుకే
ప్రకృతిని
సంరక్షించుకోవడం
ప్రతి
మనిషి
బాధ్యత.
జాతకరిత్య
ఏ
గ్రహం
దోషిగా
ఉంటే
ఆ
గ్రహానికి
సంబంధించిన
చెట్టుకు
పూజ
చేసి,
ప్రదక్షిణలు
చేస్తే
దోషం
తగ్గుముఖం
పడుతుంది.
నవ
గ్రహదోషాలు
తొలగాలంటే
ఈ
మొక్కలు
నాటండి.
పాత
కాలంనాటి
గృహాలు
లేదా
గ్రామాల్లో
ఉండే
పాత
ఇళ్లను
ఎప్పుడునా
పరిశీలించారా?
ఇందుకు
ఓ
నిర్దిష్టమైన
కారణముంది.
ఈ
మొక్కలను
ఇలా
నాలుగు
దిశల్లో
నాటడం
వల్ల
గ్రహాలు
శాంతిస్తాయని
నమ్ముతారు.
అందుకే
పెద్దలు
ఇంటి
చుట్టూ
మొక్కలు
నాటేవారు.
అంతేకాకుండా
నవగ్రహా
దోషాలున్నా
తొలుగుతాయి.
ఇంట్లో
ఎల్లవేళలగా
ప్రశాంతకరమైన
వాతావరణం
నెలకొంటుంది.
ఏలాంటి
మొక్కలు
నాటితే
మంచిదో
ఇప్పుడు
తెలుసుకుందాం.
*
అరటిచెట్టు
:-
గురుగ్రహం
(
బృహస్పతి
)
దోషం
దూరమవుతుంది.
జాతకంలో
గురు
దోషమున్నట్లయితే
ఇంటి
పెరడులో
అరటి
చెట్టును
నాటడం
శ్రేయస్కరం.
ఎందుకంటే
ఈ
మొక్క
బృహస్పతి
రూపంలో
ఉంటుంది.
అందువల్ల
అరటి
మొక్కను
నాటడం
వల్ల
జాతకంలో
ప్రబలంగా
ఉండే
దోషాలు
తొలుగుతాయి.
అలాగే
ఆర్థిక
సమస్యల
నుంచి
ఉపశమనం
లభిస్తుంది.
ఇంట్లో
ఆహ్లదకరమైన
వాతావరణం
నెలకొంటుంది.

*
పారిజాతంచెట్టు
:-
చంద్రగ్రహ
దోషాలు
నివారణ
జరుగుతుంది.
జాతకంలో
చంద్ర
దోషమున్నట్లయితే
ఇంటి
మధ్య
(
భవంతి
ఇంట్లో
లోద్ధి
)లో
పారిజాత
మొక్కలను
నాటాలి.
వీటిని
ఇంటి
మధ్యలో
కానీ
వెనక
భాగంలో
కాని
నాటితే
మంచిది.
ఫలితంగా
ఆర్థిక
విషయాల్లో
సానుకూలంగా
ఉంటుంది.
డబ్బు
సమృద్ధిగా
ఉంటుంది.
అయితే
ఈ
మొక్క
సంరక్షణలో
నిర్లక్ష్యంగా
ఉండకూడదు.
ఎందుంకంటే
ఈ
మొక్క
ఎండితే
మెదడుపై
ప్రతికూల
ప్రభావాన్ని
చూపుతుంది.
*
తులసిచెట్టు
:-
శుక్రగ్రహ
దోషాలు
నివారణ
జరుగుతావి.
జాతకంలో
శుక్రుడి
దోషమున్నట్లయితే
ఇంటి
ప్రాంగణంలో
తులసి
మొక్కను
నాటాలి.
ఇలా
చేయడం
ద్వారా
ఇంటి
నుంచి
ప్రతికూల
శక్తి
దూరమవుతుంది.
అంతేకాకుండా
సానుకూల
శక్తి
ప్రసరిస్తుంది.
కుటుంబ
సభ్యులందరి
జీవితంలో
ఆనందం,
శ్రేయస్సు
కల్గుతుంది.
శుక్రుడు
బలహీనంగా
ఉన్నట్లయితే
సాయంత్రం
తులసి
కోట
ముందు
దీపం
వెలిగించాలని
గుర్తుంచుకోండి.
*
దానిమ్మచెట్టు:-
రాహు,కేతు
గ్రహదోష
నివారణకు
అనుకూలమైన
చెట్టు.
జాతకంలో
రాహువు,
కేతువు
లోపాలు
ఉంటే..
ఇంట్లో
దానిమ్మ
మొక్కను
నాటాలి.
ఇది
రాహువు,కేతువుల
చెడు
ప్రభావాన్ని
తగ్గిస్తుంది.
వాస్తుశాస్త్రం
ప్రకారం
ఇంటి
ముందు
దానిమ్మ
చెట్టును
నాటితే
మంచిది.
ప్రతి
సోమవారం
ఉదయం
దానిమ్మ
పువ్వును
తేనెలో
ముంచి
శివుడికి
అర్చన
చేస్తే
కష్టాల
నుంచి
సులభంగా
గట్టెక్కవచ్చు.
అంతేకాకుండా
ఆర్థిక
సమస్యలు
కూడా
దూరమవుతాయి.
*
జమ్మిచెట్టు
‘
శమి’
వృక్షం:-
శనిగ్రహ
దోషాల
నివారణకు
మంచిది.
జాతకంలో
శని
దోషమున్నట్లయితే
ఇంట్లో
జమ్మిచెట్టును
నాటితే
మంచిది.
ఎందుకంటే
జమ్మి
చెట్టులో
దేవతలందరూ
కొలువుంటారని
తెలుసుకోవాలి.
ఈ
చెట్టు
శనికి
సంబంధించదని
నమ్ముతారు.
అందువల్ల
వాస్తుశాస్త్రం
ప్రకారం
జమ్మిచెట్టును
ఇంటి
ప్రధాన
ద్వారానికి
ఎడమవైపు
నాటాలి.
అలాగే
క్రమం
తప్పకుండా
జమ్మికింద
ఆవనూనె
దీపం
వెలిగించాలి.
దీంతో
శనిదేవుని
అనుగ్రహాన్ని
పొందుతారు,
చెడు
విషయాలు
కూడా
తొలగడం
ప్రారంభిస్తాయి.
*
రావిచెట్టు
“అశ్వత్త”
వృక్షం
:-
బుధ,
శని,
బృహస్పతి
దోషాలు
నివారణకు
అనుకూలమైన
వృక్షం.
జాతకంలో
ఈ
గ్రహాల
దోషాలున్నట్లయితే
రావి
చెట్టును
నాటాలి.
రావి
చెట్టును
క్రమం
తప్పకుండా
ఆరాధించడం
వలన
ఈతి
బాధలు
తొలుగుతాయి.
కుటుంబ,
సంతాన
లోపాలను
తొలగిస్తుంది.
వ్యాధుల
నుంచి
బయటపడవచ్చు.
ఆరోగ్యం
పురోగతి
సాధిస్తుంది.
జీవితంలో
ఎలాంటి
కష్టాలు
వచ్చినా
చివరకి
అనుకున్నది
పూర్తిచేస్తారు.
ఈ
వృక్షంలో
బ్రహ్మ,
విష్ణు,
మహేశ్వరు
ఉంటారు.
లక్ష్మీదేవి
అక్క
జ్యేష్టాదేవి
చెట్టు
వేరులో
ఉంటుంది
కాబట్టి
చెట్టును
ముట్టుకోకూడదు
అంటారు.
*
ఎర్ర
మందారం
చెట్టు:-
సూర్య,
కుజ
దోషాలు
నివారాణ
చేసుకోవడానికి
అనుకులమైనది.
జాతకంలో
సూర్యుడు,
కుజుడు
లోపమున్నట్లయితే
ఇంట్లో
మందార
మొక్కను
నాటాలి.
సూర్య,
కుజ
దోషాలను
తొలగిస్తుంది.
కుజుడిని
ప్రసన్నం
చేయడానికి
హనుమంతుడిని
మందార
పువ్వులతో
పూజించాలి.
అదేవిధంగా
సూర్యదేవుడికి
నీటిని
అర్పించేటప్పుడు
మందారపుష్పం
వేసిన
నీటితో
తర్పణం
చేయడం
ద్వారా
గొప్ప
ప్రయోజనాలు
అందుకుంటారు.
శరీర
దుర్వాసన
కూడా
తొలుగుతుంది.
మందార
మొక్కను
ఇంట్లో
ఎక్కడైనా
నాటవచ్చు.
ఇది
చాలా
ప్రయోజనకరంగా
ఉంటుంది.
English summary
Know the plants that are suitable for each planet including earth.
Story first published: Saturday, July 16, 2022, 7:00 [IST]