స్వల్పంగా పెరిగిన క్రూడ్..

అంతర్జాతీయంగా మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గుతున్నాయని, అందుకే- ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని షెహబాజ్ చెప్పారు. ఇకముందూ తగ్గుతున్న క్రూడ్ రేట్లకు అనుగుణంగా ఇంధన ధరలను సవరిస్తామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ రేట్ తగ్గిన విషయం తెలిసిందే. ఇవ్వాళ స్వల్పంగా పెరిగింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ క్రూడాయిల్ 101.13 డాలర్లు పలుకుతోంది.

తగ్గిన రేట్లను వాహనదారులకు బదలాయింపు..

తగ్గిన రేట్లను వాహనదారులకు బదలాయింపు..

వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌‌లో దీని ధర మరింత తక్కువే. అక్కడ ఒక బ్యారెల్ క్రూడాయిల్ రేటు 97.57 వద్ద ట్రేడింగ్ అవుతోంది. క్రూడాయిల్ రేట్లు తగ్గడం వల్ల పాకిస్తాన్ చమురు కంపెనీలకు ఊరట లభించినట్టయింది. వాటిపై భారం భారీగా తగ్గినట్టయింది. ఇదివరకు క్రూడాయిల్ బ్యారెల్ ధర 120 నుంచి 123 డాలర్ల వరకు వెళ్లిన నేపథ్యంలో.. కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాయి.

భారత్‌లో ఇవ్వాళ్టి రేట్లిలా..

భారత్‌లో ఇవ్వాళ్టి రేట్లిలా..

దానికి అనుగుణంగా పెట్రోల్, డీజిల్ రేట్లను పాకిస్తాన్ ప్రభుత్వం భారీగా పెంచింది. ఇప్పుడు వాటి రేట్లు తగ్గడం వల్ల చమురు కంపెనీలపై ఆర్థిక భారం తగ్గింది. దీన్ని వాహనదారులకు బదలాయించింది అక్కడి ప్రభుత్వం. భారత్‌లో పాత రేట్లే కొనసాగుతున్నాయి. చమురు కంపెనీలు కొద్దిసేపటి కిందటే ఇవ్వాళ్టి తాజా రేట్లను జారీ చేశాయి.

మహారాష్ట్రలో వ్యాట్ కుదింపు..

మహారాష్ట్రలో వ్యాట్ కుదింపు..

దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. వ్యాట్‌ను తగ్గించిన తరువాత ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ111.35 నుంచి 106.35 పైసలకు తగ్గింది. డీజిల్ రూ.97.28 పైసల నుంచి 94.28 పైసలకు క్షీణించింది. కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది.

విశాఖలో..

విశాఖలో..

చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలు. బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా నమోదైంది. అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ 92,38 పైసలుగా నమోదైంది.

హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది. భువనేశ్వర్‌లో లీటర్ పెట్రోల్ రూ.103.54 పైసలు, డీజిల్ రూ.95.09 పైసలు ఉంటోంది.

మహాలో రెండోసారి..

మహాలో రెండోసారి..

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాత మూడు రాష్ట్రాలు మాత్రమే తాము వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్నును తగ్గించాయి. రాజస్థాన్, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించాయి. ఇప్పుడు తాజాగా ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం మరోసారి వ్యాట్‌ను కుదించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న వ్యాట్‌ను తగ్గించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.Source link

Leave a Reply

Your email address will not be published.