భువన్‌ ఆధార్‌

గూగుల్ మ్యాప్ ఉంది అందులో చూపిస్తుంది కదా అనుకోవచ్చు. కానీ అందులో కూడా అప్పుడప్పుడు పొరపాట జరుగుతుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి ఆధార్ ను జారీ చేసే సంస్థ ఉడాయ్, ఇస్రోతో చేతులు కలిపింది. ఇస్రోకు అనుబంధంగా పనిచేసే నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ తో కలిసి ‘భువన్‌ ఆధార్‌ ‘ అనే పోర్టల్‌ను ప్రారంభించారు.

మూడు రకాల ప్రీమియం ఫీచర్లు

మూడు రకాల ప్రీమియం ఫీచర్లు

ఈ పోర్టల్ ద్వారా ఆధార్‌ కార్డుహోల్డర్లు మూడు రకాల ప్రీమియం ఫీచర్లను పొందేందుకు అవకాశం ఉంది. దగ్గర్లో ఉన్న ఆధార్‌ కేంద్రాలను తెలుసుకోవడంతో పాటు వాటి దగ్గరకు వెళ్లేందుకు మార్గం, ఏ పరిసరాల్లో ఉందో మ్యాప్‌లో చూపే ఫీచర్లను ఈ పోర్టల్‌ లో అందుబాటులో ఉన్నాయి. ఇంతకుముందు ఆధార్‌ వివరాల్ని ధ్రువీకరించడానికి ఐరిస్‌, వేలిముద్రల్ని కచ్చితంగా స్కాన్‌ చేయాల్సి ఉండేది.

ఫేస్‌ఆర్‌డీ యాప్‌

ఫేస్‌ఆర్‌డీ యాప్‌

కానీ ఉడాయ్‌ ఇటీవల ఆధార్‌ ఫేస్‌ఆర్‌డీ యాప్‌ను తీసుకొచ్చింది. ప్లేస్టోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఇంట్లో నుంచే మీ ముఖాన్ని స్కాన్‌ చేయడం ద్వారా ఆధార్‌ వివరాల్ని ధ్రువీకరించొచ్చని తెలిపింది. ఈ యాప్ అందుబాటులోకి తేవడం ద్వారా ఆధార్‌ నమోదు కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు.

భువన్‌ ఆధార్‌ పోర్టల్ లో సెంటర్లు ఎలా వెతకాలి

భువన్‌ ఆధార్‌ పోర్టల్ లో సెంటర్లు ఎలా వెతకాలి

ముందుగా గూగుల్లో https://bhuvan.nrsc.gov.in/aadhaar/ పోర్టల్‌లోకి వెళ్లాలి. స్క్రీన్‌కు ఎడమ వైపున మీకు నాలుగు డ్రాప్‌-డౌన్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. దగ్గర్లోని ఆధార్‌ నమోదు కేంద్రాన్ని తెలుసుకునేందుకు ఆప్షన్లలో ‘సెంటర్స్‌ నియర్‌బై’ను ఎంపిక చేసుకోవాలి. వెంటనే మీకు దగ్గర్లోకి కేంద్రాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.Source link

Leave a Reply

Your email address will not be published.