ఆర్థిక మాంద్యం

ఆర్థిక మాంద్యంతో క్రూడ్ ఆయిల్ డిమాండ్‌ తగ్గుతుందన్న భయంతో ధర తగ్గుతూ వస్తోంది. దీంతో బ్రెంట్ మూడు వారాలా కనిష్ఠానికి, అయితే WTI రెండు వారాల కనిష్ఠానికి చేరుకుంది. సౌదీ అరేబియా తక్షణమే చమురు ఉత్పత్తిని పెంచుతుందని యునైటెడ్ స్టేట్స్ ఆశించడం లేదు. ఆగస్ట్ 3న జరగనున్న తదుపరి OPEC+ సమావేశం ఫలితాలను పరిశీలిస్తున్నట్లు U.S. అధికారి ఒకరు రాయిటర్స్‌తో చెప్పారు.

ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం

అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీంతో U.S. ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఫెడ్ తుదుపరి సమావేశంలో 75 బేసిస్ పాయింట్ల రేటు పెంపునకు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఫెడ్ ఈ నెలలో 100 bps పెంచే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనల నుండి చమురుపై ఒత్తిడి కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత్ వంటి దేశాలకు

భారత్ వంటి దేశాలకు

“బ్రెంట్ ఈ వారం బ్యారెల్‌కు $100 కంటే తక్కువగా పడిపోయింది. మాంద్యం భయాలు ప్రస్తుతానికి తగ్గకపోవచ్చని ఇది స్లైడింగ్‌ను కొనసాగించే అవకాశం ఉంది” అని కామర్జ్‌బ్యాంక్ ఒక నోట్‌లో పేర్కొంది.

క్రూడ్ ఆయిల్ దిగుమతిపై ఆధారపడి ఉన్న భారత్ వంటి దేశాలకు ధర పెరిగితే కష్టమే.. అయితే భారత్ ప్రస్తుతానికి రష్యా నుంచి ఎక్కువ మొత్తంలో క్రూడ్ ఆయిల్ ను తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది.Source link

Leave a Reply

Your email address will not be published.