రూ. 3,187.7 కోట్ల విలువైన కేటాయింపులు

రుణదాత ప్రధాన నికర వడ్డీ మార్జిన్ మొత్తం ఆస్తులపై 4.0 శాతంగా ఉంది. ప్రీ-ప్రొవిజన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ (PPOP) రూ.15,367.8 కోట్లుగా ఉంది. PPOP, ట్రేడింగ్, మార్క్ టు మార్కెట్ నష్టాలను మినహాయించి, YY ప్రాతిపదికన 14.7 శాతం పెరిగింది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మొదటి త్రైమాసికంలో రూ. 3,187.7 కోట్ల విలువైన కేటాయింపులు చేసింది.

కొత్తగా 725 శాఖలు

కొత్తగా 725 శాఖలు

గత పన్నెండు నెలల్లో కొత్తగా 725 శాఖలు ఏర్పాటు చేయగా 29,038 మంది ఉద్యోగులను నియమించుకున్నారు. ఈ త్రైమాసికంలో 36 కొత్త శాఖలు, 10,932 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు బ్యాంకు తెలిపింది. Q1FY23 నాటికి మొత్తం బ్యాలెన్స్ షీట్ పరిమాణం రూ. 21,09,772 కోట్లుగా ఉందని, 20.3 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నట్లు HDFC బ్యాంక్ తెలిపింది. మొత్తం డిపాజిట్లు 19.2 శాతం పెరిగి రూ.16,04,760 కోట్లకు చేరాయని పేర్కొంది.

పెరిగిన డిపాజిట్లు

పెరిగిన డిపాజిట్లు

పొదుపు ఖాతా డిపాజిట్లు రూ. 5,14,063 కోట్లు, కరెంట్ ఖాతా డిపాజిట్లు రూ. 2,20,584 కోట్లతో CASA డిపాజిట్లు 20.1 శాతం పెరిగాయి. టైమ్ డిపాజిట్లు రూ. 8,70,113 కోట్లకు చేరుకున్నాయి. ఇది గత ఆర్థిక సంవత్సరం సంబంధిత త్రైమాసికంతో పోలిస్తే 18.5 శాతం పెరిగింది. ఫలితంగా మొత్తం డిపాజిట్లలో 45.8 శాతం CASA డిపాజిట్లు ఉన్నాయి.Source link

Leave a Reply

Your email address will not be published.