నిద్ర
ప్రాముఖ్యత
ఆరోగ్యకరమైన
జీవన
శైలి
ప్రక్రియ
అనేది
త్వరగా
మేల్కొనడం
నుంచి
మొదలు
అవుతుంది.
తెల్లవారుజామునే
నిద్ర
లేవడం
మంచి
ఆరోగ్యకరమైన
అలవాటు.
స్వచ్ఛమైన
గాలిలో
త్వరగా
నిద్రలేవడం
వల్ల
అనేక
ప్రయోజనాలు
ఉన్నాయి.
సెరోటోనిన్,
మెలటోనిన్,
ఆక్సిటోసిన్,
ఎండార్ఫిన్లు
సహా
న్యూరో-కెమికల్లు
లాంటి
హార్మోన్లు
ఉత్సాహాన్ని
ఇస్తాయి.
దీని
వల్ల
తెలియని
ఆనందం
సొంతం
అవుతుంది.
ఇది
రోగ
నిరోధక
వ్యవస్థ,
నాడీ-నిబంధనలు,
హార్మోన్
రెగ్యులేషన్
మెరుగైన
పని
తీరు
కనబరిచేలా
సాయం
చేస్తుంది.

ఎప్పుడు
నిద్ర
లేవాలి?
ఎప్పుడు
నిద్ర
నుంచి
మేల్కోవాలి
అనేది
చాలా
ముఖ్యం.
మంచం
మీద
నుంచి
లేవడానికి
అనువైన
సమయం
బ్రహ్మ
ముహూర్తం.
వేసవిలో
సూర్యుని
గమనాన్ని
బట్టి
కాలం
మారుతూ
ఉంటుంది.
ఇది
చాలా
ముందుగానే
ఉంటుంది.
అలాగే
శీతాకాలంలో
ఇది
కొంచెం
ఆలస్యం
అవుతుంది.
వేసవిలో
సగటున
6:00AM
గంటలకు
సూర్యోదయ
అవుతుంది
కాబట్టి,
4.30AM
ను
బ్రహ్మ
ముహూర్తంగా
పరిగణించాలి.
అలాగే
శీతాకాలంలో
సూర్యుడు
7
గంటలకు
ఉదయిస్తాడు
కాబట్టి,
5.30
గంటలను
బ్రహ్మ
ముహూర్త
సమయం
అనుకోవాలి.
బ్రహ్మముహూర్తానికి
ముందే
నిద్రలేవడం
కూడా
ఆరోగ్యానికి
మంచిది
కాదు.
రాత్రి
మంచి
ఉండాలి.
శరీరానికి
సరిపడా
నిద్ర
లేకపోతే
చాలా
రకాలుగా
సమస్యలు
వస్తాయి.
అలసట,
తలనొప్పి
సమస్యలు
వస్తాయి.
శరీరంలో
వాతాన్ని
పెంచుతుంది.
ఇది
స్థూలకాయానికి
కూడా
దారి
తీసే
ప్రమాదం
ఉంది.
ఇది
జీవక్రియ,
జీర్ణక్రియలపైనా
ప్రభావం
చూపుతుంది.

బ్రహ్మముహూర్తం
ప్రాముఖ్యత
ఒక
రోజులో
బ్రహ్మ
ముహూర్తం
అత్యంత
పవిత్రమైనదిగా
చెబుతారు.
మంత్రాలను
పఠించడం,
మత
పరమైన
ఆచారాలను
అనుసరించడం,
అధ్యయనం
చేయడం,
ఆలోచించడం,
నేర్చుకోవడం,
ఆధ్యాత్మిక
కార్యకలాపాలు,
ఆరాధన
అలాగే
ధ్యానం
చేయడానికి
బ్రహ్మ
ముహూర్తం
చాలా
మంచి
సమయం.
సూర్యోదయానికి
ముందు
రాత్రి,
తెల్లవారుజామున
ఆహ్లాదకరమైన
హార్మోన్లు
అధిక
సాంద్రతలో
ఉంటాయి.
ఇమ్యునోగ్లోబులిన్లు,
ఇతర
హార్మోన్లు
పగటి
పూట
ఎక్కువగా
ఉంటాయి.
రాత్రి
పూట
స్టెరాల్స్
హార్మోన్లు
అధిక
సాంద్రతలో
ఉంటాయి.

సెరోటోనిన్
ఇది
మొదటి
ఆహ్లాదకరమైన
హార్మోన్.
ఉదయాన్నే
ఎక్కువ
మొత్తంలో
ఉంటుంది.
జ్ఞానము,
జ్ఞాపకశక్తి,
ఆలోచన,
అభ్యాసం
లాంటి
బహు
ముఖ
విధులను
నెరవేర్చే
న్యూరోట్రాన్స్మిటర్.
సైకో-న్యూరోఇమ్యునాలజీ
మార్గం
ద్వారా
రోగ
నిరోధక
శక్తి,
నాడీ
సంబంధిత
హార్మోన్ల
పని
తీరును
మెరుగుపరుస్తుంది.

మెలటోనిన్
దీనిని
నిద్రలేపే
హార్మోన్
అని
కూడా
అంటారు.
పీనియల్
గ్రంథుల
నుండి
ఉత్పత్తి
అవుతుంది.
దీని
వల్ల
రక్తపోటు
నియంత్రణలో
ఉంటుంది.
యాంటీ
ఆక్సిడెంట్
కార్యకలాపాలను
పెంచుతుంది.
ఇది
ఆహార
పదార్థాల
నుండి
మందుల
నుండి
కూడా
ఈ
హార్మోన్
ను
పొందవచ్చు.
ఇది
సూర్యోదయానికి
ముందు
ఉత్పత్తి
అవుతుంది.
ఆక్సిటోసిన్
ఇది
పిట్యూటరీ
గ్రంథి
వెనుక
భాగం
నుండి
స్రవిస్తుంది.
ఇది
న్యూరోపెప్టైడ్
హార్మోన్.
పునరుత్పత్తి
సమయంలో
శారీరక
శ్రమ
సమయంలో
ఈ
హార్మోన్
పాత్ర
పోషిస్తుంది.
ఎండార్ఫిన్లు
ఇది
పిట్యూటరీ
గ్రంథి
నుండి
ఉత్పత్తి
అవుతుంది.
ఎండోజీనస్
ఓపియాయిడ్
న్యూరోపెప్టైడ్
హార్మోన్
ఇది.
ఎండార్ఫిన్లు
ప్రధానంగా
నొప్పిని
తగ్గించేందుకు
సహాయపడతాయి.అలాగే
ఆనందాన్ని
ఇస్తుంది.
ఏవైనా
గాయాలు
అయినప్పుడు
ఇది
సహజ
వైద్యంలాగా
పని
చేస్తుంది.
ఫైనల్
నోట్
ఆరోగ్యకరమైన
జీవనశైలి
వ్యాధులను
నివారిస్తుంది.
ఆరోగ్యాన్ని
మెరుగు
పరుస్తుంది.
శారీరకంగా,
మానసికంగా
ఉండేందుకు
సాయపడుతుంది.