ఆదాయాలు క్షీణించాయి..

గత రెండు త్రైమాసికాల్లో పలు కంపెనీల ఆదాయాలు క్షీణించాయని గుర్తు చేసింది. అయితే స్టాక్‌లు ఇప్పటికీ ప్రీమియంలోనే ఉన్నాయని తెలిపింది. మోర్గాన్ స్టాన్లీ జూన్ 2023 త్రైమాసికంలో ఐటీ కంపెనీల వృద్ధి అట్టడుగు స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. తద్వారా తదుపరి ఆరు నెలల్లో ఐటీ కంపెనీలకు ప్రతికూలత ఉంటందని పేర్కొంది.

టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్..

టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్..

మిడ్ క్యాప్స్ కంటే లార్జ్ క్యాప్‌ స్టాక్ పెట్టుబడికి అనుకూలమని అభిప్రాయపడింది. లార్జ్ క్యాప్స్‌లో టెక్ మహీంద్రా లిమిటెడ్, ఇన్ఫోసిస్ లిమిటెడ్ పికింగ్ ఆర్డర్‌లో ముందున్నాయి. టెక్ మహీంద్రా మంచి గ్రోత్ విజిబిలిటీ, సహేతుకమైన వాల్యుయేషన్‌ను కలిగి ఉండగా, ఇన్ఫోసిస్ మార్కెట్ షేర్ లాభాలు, మార్జిన్ బాటమ్ అవుట్ ఉన్నాయని చెప్పింది.

విప్రో, హెచ్ సీఎల్..

విప్రో, హెచ్ సీఎల్..

విప్రో లిమిటెడ్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లను వేయిటేజ్ ను తగ్గించింది. సెక్టార్ వాల్యుయేషన్ తగ్గింపే ఇందుకు కారణంగా పేర్కొంది. “మిడ్ క్యాప్స్‌లో ఎంఫాసిస్‌ను మాత్రమే అధిక వేయిటేజ్ ఇచ్చారు. L&T ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీతో కలిసి సమాన వేయిటేజ్ ఇచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ కూడా, స్థూల సవాళ్లు మధ్యకాలంలో IT మార్జిన్‌లను దెబ్బతీస్తాయని, అయితే ఈ రంగంపై “సానుకూల వైఖరి”ని కొనసాగిస్తున్నాయని పేర్కొంది.Source link

Leave a Reply

Your email address will not be published.