News
oi-Mamidi Ayyappa
Life In America: అమెరికా వెళ్లాలనుకోవటం చాలా మంది భారతీయుల కల అని మనందరికీ తెలుసు. పైగా అక్కడ గ్రీన్ కార్డ్ పొంది స్థిరపడాలని చాలా మంది కలలు కంటుంటారు. ఉన్నత చదువల కోసం వెళ్లి మెల్లగా అక్కడే నివసించాలన్నది అనేక మంది అతిపెద్ద కల. సాధారణంగా యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశాలలో ఒకటి. అయితే ఇదే సమయంలో.. చాలామంది ప్రజలు ఎక్కువగా ఇష్టపడే దేశం కూడా. ఎప్పుడైనా ఆలోచించారా అమెరికాలో నివసించడానికి మీకు ఎంత డబ్బు అవసరం అవుతుందో. ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఎవరు సుఖంగా ఉన్నారు?
అమెరికన్లు 7,74,000 డాలర్లు ఉంటే ఆర్థికంగా సుఖంగా ఉంటారని ఇటీవలి అధ్యయనం కనుగొన్నట్లు CNBC నివేదిక వెల్లడిస్తోంది. అయితే USలో నివసించే నగరాన్ని బట్టి పైన పేర్కొన్న మొత్తం మారుతుంది. అసలు అమెరికాలోని ఏఏ నగరాల్లో నివసించడానికి ఎంత డబ్బు కావాలో ఇప్పుడు గమనిద్దాం.
న్యూయార్క్ & శాన్ ఫ్రాన్సిస్కో:
ఆర్థిక సేవల సంస్థ చార్లెస్ షాప్ వార్షిక ఆధునిక సంపద నివేదిక ప్రకారం.. శాన్ ఫ్రాన్సిస్కో లేదా న్యూయార్క్ వంటి ఖరీదైన నగరాల్లో సౌకర్యవంతంగా జీవించడానికి ఒక వ్యక్తికి 1 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నికర విలువ అవసరం. మన కరెన్సీ ప్రకారం దీని విలువ ప్రస్తుతం సుమారు రూ.8 కోట్లకు సమానం.
శాన్ ఫ్రాన్సిస్కొ:
శాన్ ఫ్రాన్సిస్కోలో ఆర్థికంగా సౌకర్యవంతంగా నివసించాలంటే.. 1.7 మిలియన్ డాలర్లు అవసరమని సర్వే అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇది మన కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.15 కోట్లకు సమానం అని చెప్పుకోవాలి. అమెరికాలోని 12 అతిపెద్ద మెట్రో నగరాల సర్వే శాన్ ఫ్రాన్సిస్కోను అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటిగా పేర్కొంది.

ఇతర ప్రముఖ నగరాలు:
2022లో అమెరికాలోని వివిధ నగరాల్లో ఆర్థికంగా సుఖంగా ఉండాలంటే ఎంత డబ్బు అవసరమో చూద్దాం.
* శాన్ ఫ్రాన్సిస్కో – 1.7 మిలియన్ డాలర్లు
* న్యూయార్క్ నగరం – 1.4 మిలియన్ డాలర్లు
* దక్షిణ కాలిఫోర్నియా (లాస్ ఏంజిల్స్ & శాన్ డియాగో)- 1.3 మిలియన్ డాలర్లు
* సీటెల్ – 1.2 మిలియన్ డాలర్లు
* వాషింగ్టన్ – 1.1 మిలియన్ డాలర్లు
కొంత తక్కువ డబ్బుతో అంటే ఒక మిలియన్ డాలర్ల కంటే తక్కువగా డబ్బు ఉన్నప్పటికీ అమెరికాలోని కొన్ని నగరాల్లో మంచి జీవితాన్ని సౌకర్యవతంగా గడపవచ్చు. అయితే ఇప్పుడు ఈ నగరాన జాబితా గమనిద్దాం. అక్కడ నివసించటానికి ఎంక కావాలో చూద్దాం..
* చికాగో- 9,56,000 డాలర్లు
* హ్యూస్టన్ – 9,19,000 డాలర్లు
* బోస్టన్ – 8,92,000 డాలర్లు
* డల్లాస్ – 8,40,000 డాలర్లు
* అట్లాంటా – 7,71,000 డాలర్లు
* ఫీనిక్స్ – 7,47,000 డాలర్లు
* డెన్వర్ – 6,71,000 డాలర్లు
సర్వే ఇలా:
ఫిబ్రవరి 2022లో ఈ సర్వే నిర్వహించబడింది. 21 నుంచి 75 ఏళ్ల వయస్సు ఉన్న మెట్రో నగరవాసులపై ఈ సర్వే నిర్వహించబడింది. ఆర్థికంగా సుఖంగా ఉన్నారా అనేది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. ఇది సొంత ఇల్లు, పొదుపు, ఖర్చులను బట్టి వేరువేరుగా ఉంటుంది.
English summary
know about money required to live happily in USA
know about money required to live happily in various cities in america on an average
Story first published: Sunday, July 17, 2022, 7:28 [IST]