ఇన్వెస్టర్లు కోటీశ్వరులయ్యారు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ స్టాక్ గురించే. కొన్ని సంవత్సరాల క్రితం ఈ కంపెనీ ధర కేవలం 77 పైసలు కాగా.. ప్రస్తుతం ఈ కంపెనీ స్టాక్ ధర దాదాపు రూ.285.35గా ఉంది. ఎవరైనా ఈ కంపెనీలో కేవలం రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాని విలువ దాదాపు రూ.7 కోట్లకు చేరి ఉండేది.

కేవలం రూ.10 వేలు మాత్రమే పెట్టుబడి పెట్టినా.. ఇన్వెస్టర్లకు ఇప్పుడు రూ.70 లక్షలు పొందేవారు. ఇలా ఈ కంపెనీ తన ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. NSEలో ఈ షేరు 52 వారాల కనిష్ఠ ధర రూ.242.05 కాగా, గరిష్ఠ ధర రూ.408.60గా ఉంది. ప్రస్తుతం ఈ షేర్ రాకెట్ స్పీడ్ తో ఎగబాకుతోంది.

బోనస్ షేర్లతో ఇన్వెస్టర్ల సుడి తిరిగింది..

బోనస్ షేర్లతో ఇన్వెస్టర్ల సుడి తిరిగింది..

హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ షేర్లు 25 ఆగస్ట్ 2000న BSEలో 77 పైసల రేటు వద్ద ట్రేడవుతున్నాయి. ఆ సమయంలో ఎవరైనా హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌లో లక్ష రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేసి ఉంటే, అతనికి దాదాపు 1,29,870 షేర్లు వచ్చేవి. దీని తర్వాత.. హిందుస్థాన్ జింక్ 7 మార్చి 2011న 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇచ్చింది. అంటే ఇన్వెస్టర్ కలిగిఉన్న ప్రతి షేరుకు మరో షేర్ ఉచితంగా వచ్చింది. అంటే అతనివద్ద ఉండే షేర్ల సంఖ్య 25,9,740కి పెరిగింది.

లక్ష రూపాయలు 7 కోట్లు ఎలా మారిందంటే..

లక్ష రూపాయలు 7 కోట్లు ఎలా మారిందంటే..

పైన చెప్పుకున్న విధంగా బోనస్ షేర్లు రావటంతో.. కంపెనీలో పెట్టుబడిదారుడి వద్ద ఉన్న షేర్ల సంఖ్య 2,59,740కి పెరిగింది. అదే సమయంలో.. హిందుస్థాన్ జింక్ స్టాక్ 16 జూలై 2022న BSEలో దాదాపు రూ.285 స్థాయిలో ట్రేడవుతోంది. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం రూ.లక్ష పెట్టుబడి ఇప్పుడు దాదాపు రూ.7.50 కోట్లకు పెరిగింది. ఇదే క్రమంలో ఎవరైనా పెట్టుబడిదారుడు 77 పైసల స్థాయిలో కేవలం రూ.10,000 మాత్రమే పెట్టుబడి పెట్టినట్లయితే.. దాని విలువ దాదాపు రూ.75 లక్షల వరకు ఉండేది. ఆ విధంగా హిందుస్థాన్ జింక్ షేర్ ఈ కాలంలో 26,500 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇన్వెస్టర్లకు అందించింది.

2008లో పెట్టుబడి పెడితే..

2008లో పెట్టుబడి పెడితే..

హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ షేర్ రేటు 24 అక్టోబర్ 2008న BSEలో రూ.23.90 స్థాయిలో ఉంది. 2008 అక్టోబర్ 24న ఎవరైనా కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే.. అతని పెట్టుబడి విలువ ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం దాదాపుగా రూ.11.86 లక్షలకు పెరిగి ఉండేది. ఈ స్టాక్ నుంచి సగటు ఇన్వెస్టర్ గ్రహించాల్సింది ఏమిటంటే.. సరైన స్టాక్ లో దీర్ఘకాలం పెట్టుబడులు పెడితే అవి నిలకడగా రాబడులను అందిస్తాయి.Source link

Leave a Reply

Your email address will not be published.