ఆవిరైన ఐటీ కంపెనీల మార్కెట్ క్యాప్..

బీఎస్ఈ సూచీలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) స్టాక్ అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. దాని మార్కెట్ విలువ రూ.99,270.07 కోట్లు తగ్గి రూ.10,95,355.32 కోట్లకు చేరుకుంది. కంపెనీ జూన్ త్రైమాసిక ఆదాయాలు మార్కెట్ అంచనాలను అందుకోవడంలో విఫలమవడంతో గత వారం TCS షేర్లు పడిపోయాయి. దీనికి తోడు మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా తన మార్కెట్ క్యాప్ లో రూ.35,133.64 కోట్ల కోతను చవిచూసింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ రూ.6,01,900.14 కోట్లకు చేరుకుంది.

బ్యాంకింగ్ స్టాక్స్ పరిస్థితి ఇలా..

బ్యాంకింగ్ స్టాక్స్ పరిస్థితి ఇలా..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.18,172.43 కోట్లు తగ్గి రూ.7,57,659.72 కోట్లకు చేరుకోగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్ క్యాప్ రూ.8,433.76 కోట్లు క్షీణించి రూ.4,27,488.90 కోట్లకు చేరుకుంది.ఇదే క్రమంలో.. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,091.62 కోట్లు తగ్గి.. రూ.4,02,121.99 కోట్లకు చేరగా, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీ విలువ రూ.3,158.85 కోట్లు తగ్గి.. రూ.5,22,498.11 కోట్లకు చేరుకుంది.

పెరిగిన ఎల్ఐసీ మార్కెట్ క్యాప్..

పెరిగిన ఎల్ఐసీ మార్కెట్ క్యాప్..

హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ విలువ రూ.17,128.52 కోట్లు పెరిగి రూ.6,03,551.26 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.6,801.72 కోట్లు పెరిగి మార్కెట్ విలువను రూ.16,24,681.08 కోట్లకు చేరింది. కాగా.. ITC కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,318.81 కోట్లు పెరిగి రూ.3,62,327.81 కోట్లకు చేరగా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ.316.25 కోట్లు పెరిగి రూ.4,48,157.71 కోట్లకు చేరుకుంది.

టాప్-10 కంపెనీల పరిస్థితి..

టాప్-10 కంపెనీల పరిస్థితి..

టాప్-10 సంస్థల ర్యాంకింగ్‌లో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంత విలువైన దేశీయ కంపెనీగా కొనసాగింది. తర్వాత TCS, HDFC బ్యాంక్, HUL, ఇన్ఫోసిస్, ICICI బ్యాంక్, LIC, SBI, HDFC, ITC కంపెనీలు ఉన్నాయి.Source link

Leave a Reply

Your email address will not be published.