అంబానీని వెనక్కు నెట్టి..

బిలియనీర్స్ జాబితాలో గౌతమ్ అదానీ ప్రపంచలో 10వ స్థానంలో ఉన్నారు. తొలిసారిగా ఆయన ఈ ఘనత సాధించారు. ఈ ఏడాది సంపాదనతో గౌతమ్ అదానీ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఏడాది ఆయన నికర విలువ 12 బిలియన్ డాలర్లు పెరగగా, అంబానీ నికర విలువ 2.07 బిలియన్ డాలర్లు తగ్గడం గమనార్హం.

అదానీ విజయం ప్రారంభం ఇలా..

అదానీ విజయం ప్రారంభం ఇలా..

గౌతమ్ అదానీ జూన్ 24, 1962న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. అదానీ కుటుంబం అహ్మదాబాద్‌లోని పోల్ ఏక్ చాల్‌లో నివసించేది. గుజరాత్ యూనివర్శిటీలో Bcom పూర్తి చేయకుండానే ముంబైకి వచ్చిన గౌతమ్ అదానీ వ్యాపార ప్రయాణం మొదలైంది. అతను డైమండ్ సార్టర్‌గా తన మొదటి ఉద్యోగాన్ని ప్రారంభించారు. కొన్ని సంవత్సరాల్లోనే ముంబైలోని జవేరీ బజార్‌లో తన స్వంత డైమండ్ బ్రోకరేజ్ సంస్థను ప్రారంభించారు.

సోదరుడి ఫ్యాక్టరీలో ఇలా..

సోదరుడి ఫ్యాక్టరీలో ఇలా..

ముంబైలో కొన్నేళ్లు గడిపిన తరువాత.. అదానీ తన సోదరుడి ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పని చేయడానికి అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చేశాడు. ఇక్కడి నుంచి గౌతమ్ అదానీ PVC (పాలీవినైల్ క్లోరైడ్‌ను) దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలా అతను ప్రపంచ వాణిజ్యంలోకి ప్రవేశించాడు. ప్లాస్టిక్ తయారీలో PVC ఎక్కువగా ఉపయోగించబడుతుండటంతో అతని దీర్ఘకాలిక ప్రయోజనాన్ని పొందాడు.

1991 ఆర్థిక సంస్కరణల సమయంలో..

1991 ఆర్థిక సంస్కరణల సమయంలో..

PVC దిగుమతులు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. అదానీ గ్రూప్ పవర్ అండ్ అగ్రి కమోడిటీ అధికారికంగా 1988లో స్థాపించబడింది. 1991లో భారతదేశంలో ఆర్థిక సంస్కరణల కారణంగా అదానీ వ్యాపారం తక్కువ కాలంలోనే వైవిధ్యభరితంగా మారింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని అదానీ బహుళజాతి వ్యాపారవేత్తగా మారారు. గౌతమ్ అదానీకి 1995 భారీ విజయాన్ని అందించింది. ముంద్రా పోర్ట్ ఆపరేట్ చేయడానికి అదానీ కంపెనీ కాంట్రాక్టును పొందింది. గౌతమ్ అదానీ తన వ్యాపారం వైవిధ్యతను కొనసాగించాడు. ఆలా 1996లో అదానీ పవర్ లిమిటెడ్ ఉనికిలోకి వచ్చింది.

సామాజిక సేవలో..

సామాజిక సేవలో..

2022లో తన పుట్టినరోజు, తండ్రి 100వ వర్ధంతి సందర్భంగా, అదానీ తన సంపదలో రూ.60 వేల కోట్లను సామాజిక కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ఇలా ప్రస్తుతం ఆయన దేశంలో అనేక రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తూ.. అగ్రగామి వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు.Source link

Leave a Reply

Your email address will not be published.